ఎట్ట‌కేల‌కు ఆ కోరిక తీర్చుకున్న నాని.. ఫుల్ ఖుషీలో న్యాచుర‌ల్ స్టార్‌!

న్యాచుర‌ల్ స్టార్ నాని త్వ‌ర‌లో `హ‌య్ నాన్న‌` మూవీతో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించ‌బోతున్న సంగ‌తి తెలిసిందే. సీతారామంతో సెన్సేష‌న్ సృష్టించిన అందాల భామ మృణాల్ ఠాకూర్ ఈ సినిమాలో హీరోయిన్ గా న‌టిస్తే.. కియారా ఖన్నా అనే చైల్డ్ ఆర్టిస్ట్ నానికి కూతురుగా యాక్ట్ చేసింది. వైర ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌పై మోహన్ చెరుకూరి, విజయేందర్ రెడ్డి తీగల నిర్మిస్తున్న‌ ఈ సినిమాకు శౌర్యువ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు.

తండ్రి, కూతురు సెంటిమెంట్ నేప‌థ్యంలో సాగే హాయ్ నాన్న డిసెంబ‌ర్ 7న తెలుగుతో పాటు త‌మిళ్, క‌న్న‌డ‌, మ‌ల‌యాళ‌, హిందీ భాష‌ల్లో గ్రాండ్ రిలీజ్ కాబోతోంది. తాజాగా బ‌య‌ట‌కు వ‌చ్చిన ఈ సినిమా టీజ‌ర్ కు అదిరిపోయే రెస్పాన్స్ ద‌క్కింది. అయితే టీజ‌ర్ విడుదల సంద‌ర్భంగా ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో నాని ఓ ఇంట్రెస్టింగ్ బ‌య‌ట‌పెట్టారు.

ఎప్ప‌టినుంచో ఉన్న ఓ కోరిక హాయ్ నాన్న‌తో తీరిపోయింద‌ని నాని ఫుల్ ఖుషీగా చెప్పుకొచ్చాడు. `ఆడపిల్ల తండ్రిని కావాలనేది నా కోరిక. కానీ అబ్బాయి పుట్టాడు. వాడితోనే సరిపెట్టుకున్నా. కానీ ఈ సినిమాతో నాకోరిక తీరింది. నాకూ ఓ కూతురు దొరికింది` అంటూ నాని చిన్నారి కియారా ఖ‌న్నాను ఉద్ధేశిస్తూ మాట్లాడాడు. మొత్తానికి హాయ్ నాన్న ద్వారా కియారా ఖ‌న్నాకు నాని బాగా క‌నెక్ట్ అయిపోయాడ‌ని ఆయ‌న మాట‌ల బ‌ట్టీ స్ప‌ష్టంగా తెలుస్తోంది. ఇక సినిమా గురించి నాని మాట్లాడుతూ.. `నా మనసుకు చాలా దగ్గరైన కథ ఇది. భావోద్వేగపూరితమైన కథ, కథనాలతో సాగే హాయ్ నాన్ని అందరికీ నచ్చుతుందని నా నమ్మకం` అని పేర్కొన్నారు.