హీరోయిన్గా ఛాన్స్ కొట్టేసిన ” బిగ్ బాస్ ” బ్యూటీ రతిక.. డైరెక్టర్ ఎవ‌రంటే..?

” బిగ్ బాస్ 7 ” రతిక బంపర్ ఆఫర్ కొట్టేసింది. ఇప్పటివరకు గుర్తింపులేని చిన్న చిన్న పాత్రలు చేస్తూ ఈ బ్యూటీ.. ఇప్పుడు ఏకంగా హీరోయిన్ అయిపోయింది. బిగ్ బాస్ నుంచి నాలుగో వారం ఎలిమినేట్ అయిపోయిన ఈ ముద్దుగుమ్మ.. ఆ తెలుగు దర్శకుడు కొత్త సినిమాలో లీడ్ రోల్ చేస్తుంది. ఇంతకీ ఎవరా దర్శకుడు? ఏంటా సినిమా? ఇప్పటివరకు తెలుగులో 6 సీజన్లో పూర్తి చేసుకుంది. ప్రస్తుతం ఏడవ సీజన్ నడుస్తుంది.

అయితే ఈ షోలో పాల్గొన్న తర్వాత ఎవరైనా కెరీర్ పరంగా బాగుపడ్డారు అంటే అది సోహైల్ మాత్రమే. ఎందుకంటే ఆ సీజన్లో గెలిచిన అభిజిత్ కి కూడా ఛాన్సులు రాలేదు కానీ మనోడు మాత్రం హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్రస్తుత సీజన్లో కాంట్రవర్సీ బ్యూటీగా పేరు తెచ్చుకున్న రతిక.. గ్లామర్ పరంగా మంచి మార్కులు తెచ్చుకుంది. కానీ గేమ్ సరిగ్గా ఆడక బిగ్ బాస్ నుంచి ఎలిమినేట్ అయిపోయింది. గతంలో నారప్ప, కార్తికేయ, దృశ్యం 2 తదితరుల సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేసిన ఈ బ్యూటీ కి దర్శకుడు కె. రాఘవేంద్రరావు అవకాశం ఇచ్చాడు.

స్వయంగా ఈ విషయాన్ని రతికనే ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ పెట్టింది. దర్శకుడిగా కె. రాఘవేంద్రరావు పని ఎప్పుడో అయిపోయింది. ఎందుకంటే 2017లో చివరగా సినిమా తీశారు. ఆ తర్వాత మరో మూవీ చేయలేదు. ఇప్పుడు ఆయన లవ్ స్టోరీ చేసేందుకు రెడీ అయ్యాడట. అందులోనే రతికాకి అవకాశం ఇచ్చినట్లు తెలుస్తుంది. ఇక ఇది ప్రకటన వరకే పరిమితం అవుతుందా? లేదా రిలీజ్ అవుతుందా అనేది చూడాలి.

 

View this post on Instagram

 

A post shared by Rathika (@rathikarose_official)