టాలీవుడ్ నుండి గిన్నిస్ బుక్ లో చోటు సంపాదించుకున్న ఆరుగురు స్టార్స్ ఎవ‌రో తెలుసా?

తమకున్న స్పెషల్ టాలెంట్ ను ప్రపంచానికి పరిచయం చేసి ప్ర‌తి ఏడాది ఎంతో మంది గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో త‌మ పేరును ల‌ఖించుకుంటున్నారు. అయితే ఈ జాబితాలో టాలీవుడ్ కి చెందిన సెలబ్రిటీలు ఉన్నారండోయ్‌. మ‌రి ఇప్ప‌టి వ‌ర‌కు టాలీవుడ్ నుండి గిన్నిస్ బుక్ లో చోటు సంపాదించుకున్న స్టార్స్ ఎవ‌రు అన్న‌ది తెలుసుకుందాం ప‌దండి.

టాలీవుడ్ నుండి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లోకి ఎక్కిన వారిలో కామెడీ కింగ్‌ బ్ర‌హ్మానందం ఒక‌రు. సుధీర్గ కాలం నుంచి హాస్య‌న‌టుడిగా స‌త్తా చాటుతున్న బ్ర‌హ్మానందం.. 1000 కి పైచిలుకు సినిమాల్లో నటించినందుకు 2010లో ఆయ‌న పేరును గిన్నిస్ బుక్ లో ల‌ఖించారు. గాన కోకిల పి. సుశీల 17, 695 సోలో, డ్యూయెట్ మరియు కోరస్ బ్యాక్డ్ పాటలు పాడి రికార్డ్ సృష్టించారు. దీంతో ఆమె గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించుకున్నారు.

గాయ‌కుడు ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం తెలుగు, తమిళ, కన్నడ, హిందీ లాంటి భాషల్లో సుమారు 40 వేలకు పైగా పాటలు పాడారు. అత్య‌ధిక పాటలు పాడిన గాయ‌కుడిగా 2001లో బాలు గిన్నిస్ బుక్ లో చోటు ద‌క్కించుకున్నారు. లెజండ‌రీ న‌టి, నిర్మాత‌, ద‌ర్శ‌కురాలు విజ‌య‌నిర్మాల‌.. వివిధ భాష‌ల్లో 42 సినిమాలు డైరెక్ట్ చేసిన ఏకైక‌ మ‌హిళ‌గా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో అర్హత సాధించారు.

100 భాష‌ల్లో 100 పాట‌లు పాడినందుకు గాను గ‌జ‌ల్ కూడా గిన్నిస్ బుక్ లోకి ఎక్కారు. అలాగే శతాధిక చిత్రాలను నిర్మించి ప్రపంచ రికార్డ్ సృష్టించిన నిర్మాతగా డి. రామానాయుడు గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్ రికార్డ్స్ లో చోటు సంపాదించారు. అత్యధిక చిత్రాల దర్శకుడుగా దాసరి నారాయణరావు గిన్నిస్‌ పుటలకెక్కారు. ఈయ‌న దాదాపు 150 చిత్రాలకు దర్శకుడిగా, 53 సినిమాల‌కు నిర్మాత‌గా, 250 పైగా చిత్రాలకు ర‌చ‌యిత‌గా ప‌ని చేశారు.