బ్రేకింగ్: బాలయ్య ” అన్ స్టాపబుల్ – 3 ” ఫస్ట్ ఎపిసోడ్ ఎప్పుడో తెలుసా..?

నందమూరి నటసింహం బాలకృష్ణ అటు సినిమాలు, ఇటు రాజకీయల‌తో పాటు మధ్యలో అన్ స్టాపబుల్ వంటి క్రేజీ షో తో ఆడియన్స్ లో మరింత క్రేజ్ సంపాదించుకుంటున్నాడు. టాలీవుడ్ టాప్ సీనియర్ స్టార్ హీరోగా దూసుకుపోతున్న బాలయ్య హోస్ట్‌గా ఆడియన్స్ ముందుకి వచ్చిన అన్ స్టాపబుల్ రెండు సీజన్స్ కూడా గ‌తంలో అందరిని ఆకట్టుకుని మంచి రెస్పాన్స్ సొంతం చేసుకున్నాయి.

అయితే లేటెస్ట్ టాలీవుడ్ బజ్ ప్రకారం నేడు అన్ స్టాపబుల్ సీజన్ 3 కి బాలయ్య అఫీషియల్ గా సైన్ చేశారని సమాచారం. ఇ్ అతి త్వరలో ఫస్ట్ ఎపిసోడ్ ని ఒక ప్రముఖ టాలీవుడ్ సెలబ్రిటీతో గ్రాండ్ గా షూట్ చేయనున్నారని టాక్. ఇక ఆ ఫస్ట్ ఎపిసోడ్ ని రానున్న దసరా పండగ కానుకగా టెలికాస్ట్ చేసేందుకు ఆహా యాజమాన్యం వేగంగా ఏర్పాట్లు చేస్తుంద‌ట.

ఇక‌ త్వరలోనే దీనికి సంబంధించిన వాటి గురించి అధికారిక ప్రకటన కూడా రానున్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతం బాలయ్య – అనిల్ రావిపూడి దర్శకత్వంలో ” భగవంత్ కేసరి” సినిమా చేస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే. ఇక ఈ సినిమా అక్టోబర్ 19న ప్రేక్షకుల ముందుకు రానుంది.