” హాయ్ నాన్న ” నుంచి ” గాజు బొమ్మ ” సాంగ్ రిలీజ్ చేస్తున్న సూపర్ స్టార్.. హార్ట్ టచింగ్ ఎమోషన్స్..!!

నాచురల్ స్టార్ నాని హీరోగా మృణాల్‌ ఠాకూర్ హీరోయిన్గా యువ దర్శకుడు శౌర్యువ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ లవ్, ఎమోషనల్, ఫ్యామిలీ ఎంటర్టైనర్ మూవీ ” హాయ్ నాన్న “. ఈ సినిమాని వైరా ఎంటర్టైన్మెంట్, టి సిరీస్ ఫిలిమ్స్ బ్యానర్స్ పై మోహన్ చెరుకూరి, డాక్టర్ విజయేందర్ రెడ్డి తీగల గ్రాండ్ లెవెల్లో పాన్ ఇండియా రేంజ్ లో నిర్మిస్తున్నారు. ఇక ఈ మూవీ నుంచి ఇప్పటికే రిలీజ్ అయిన ఫస్ట్ సాంగ్ అందరిని ఆకట్టుకుంది.

కాగా రేపు ఈ మూవీ నుంచి గాజు బొమ్మ అనే పల్లవితో సాగె సెకండ్ సాంగ్ ని రిలీజ్ చేయనున్నారు మేకర్స్. తాజాగా ఈ సాంగ్ యొక్క ప్రోమో రిలీజ్ అందరిని అలరిస్తుంది. అసలు మ్యాటర్ ఏమిటంటే.. గాజు బొమ్మ లిరికల్ వీడియో సాంగ్ ని సూపర్ స్టార్ మహేష్ బాబు రేపు ఉదయం 11 గంటల కు రిలీజ్ చేయనున్నట్లు కొద్దిసేపటి క్రితం హాయ్ నాన్న మేకర్స్ యొక్క పోస్టర్ ద్వారా అనౌన్స్ చేశారు.

హేషం అబ్దుల్ వాహాబ్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా తండ్రి కూతురు సెంటిమెంట్తో తెరకెక్కుతుండగా.. ఈ మూవీలో నాని కూతురి పాత్రలో బేబీ కియారా ఖన్నా నటిస్తుంది. ఈ మూవీ డిసెంబర్ 21న ప్రేక్షకుల ముందుకి రానుంది.