టాలీవుడ్ యంగ్ అండ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని రీసెంట్ గా `స్కంద` మూవీతో ప్రేక్షకులను పలకరించిన సంగతి తెలిసిందే. ఈ మాస్ మసాలా యాక్షన్ ఎంటర్టైనర్ కు బోయపాటి శ్రీను దర్శకత్వం వహించాడు. సెప్టెంబర్ 28న ప్రేక్షకుల ముందుకు వచ్చిన స్కందకు మిక్స్డ్ టాక్ లభించింది. అయినాసరే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను రాబట్టింది.
కానీ బ్రేక్ ఈవెంట్ టార్గెట్ ను మాత్రం రీచ్ కాలేకపోయింది. ఈ సంగతి పక్కన పెడితే.. స్కందలో రామ్ ఇంట్రడక్షన్ సీన్ గుర్తుండే ఉంటుంది. రామ్ ఇంట్రడక్షన్ సమయంలో భారీ దున్నపోతుతో ఫైట్ ఉంటుంది. ఈ ఫైట్ సీన్ కోసం ఏకంగా మేకర్స్ ఎన్ని కోట్లు ఖర్చు పెట్టారో తెలిస్తే షాక్ అయిపోతారు.
ఆ ఒక్క సీన్ బడ్జెట్ తో చిన్న సినిమాను తీసేయొచ్చు. ఎందుకంటే, రామ్ ఇంట్రడక్షన్ సీన్ కోసం ఏకంగా రూ. 4.5 కోట్లు ఖర్చు పెట్టారట. అలాగే ఈ ఫైట్ కోసం ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 29 జనరేటర్లను ఉపయోగించారట. ఇంట్రడక్షన్ సీన్ బాగా రావాలని ఖర్చు విషయంలో బోయపాటి శ్రీను ఏ మాత్రం వెనుకడుగు వేయలేదు. ఇక సినిమాలో ఆ సీన్ బాగానే ఉన్నా.. స్కంద ఇంతవరకు క్లీన్ హిట్ మాత్రం కాలేదు.