ఉప్పు ఎక్కువగా తింటే కలిగే నష్టాలు ఇవే..!!

మనం తరచూ ఎక్కువగా వంటలలో భోజనంలో కచ్చితంగా ఉప్పు కలుపుతూ ఉంటాము.. అయితే ఇలా ఉప్పు ఎక్కువగా చాలామంది తింటూ ఉంటారు. ఉప్పు ఎక్కువగా తినడం చాలా ప్రమాదమట. ముఖ్యంగా నరాలు కండరాల పనితీరును మెరుగుపరచడంలో ఎలక్ట్రోలైట్లను సమతుల్యంగా చేయడంలో ఉప్పు చాలా సహాయపడుతుంది. ఉప్పు ఆరోగ్యానికి మేలు చేసేది అయినప్పటికీ వాటిని తగిన మోతాదులో ఉపయోగించుకోవాలని వైద్యుల సైతం తెలియజేస్తున్నారు. ఈ ఉప్పుని సైతం ఎక్కువగా తీసుకోవడం వల్ల పలు అనారోగ్య సమస్యలు వస్తాయట. వాటి గురించి తెలుసుకుందాం.

Salt in Diet: Should We Cut It Down During Summer? - HealthKart

ఉప్పుని ఎక్కువగా తీసుకోవడం వల్ల రక్తపోటు పెరుగుతుంది. ఇందులో ఉండే సోడియం శరీరంలో ఉండే నీటి శాతాన్ని పెంచడం వల్ల రక్తపరిమాణం పెరిగి రక్తనాళాల పైన చాలా ఒత్తిడికి గురవుతుందట. అంతేకాకుండా అధిక రక్తపోటుతో ఉంటే గుండెపోటు వచ్చే ప్రమాదం ఉంటుంది. అధికంగా ఉప్పుని తీసుకున్నట్లు అయితే మూత్రపిండాలపైన తీవ్రమైన ప్రభావాన్ని చూపిస్తుందని నిపుణులు తెలుపుతున్నారు. ఉప్పు తరచూ ఎక్కువగా తింటే జ్ఞాపకశక్తి కూడా తగ్గిపోతుందట.దీంతో మెదడుకు సంబంధించిన సమస్యలు కూడా వెలుపడతాయి.

ఉప్పును ఎక్కువగా తీసుకోవడం వల్ల ఎముకలు ఆరోగ్యానికి అవసరమయ్యే కాల్షియం మూత్రం ద్వారా ఎక్కువగా వెలుబడుతుంది. దీంతో ఎముకల సాంద్రత కూడా తగ్గిపోతుందట. ఈ విధంగా మన శరీరం పైన ఉప్పు చాలా తీవ్రమైన ప్రభావాన్ని చూపుతుంది. అందుకే ఉప్పుని తగిన మోతాదులలో తీసుకోవడం చాలా మంచిది.. ముఖ్యంగా టేస్టింగ్ సాల్ట్ వంటివి అసలు తినకూడదు. వీటివల్ల చాలా ప్రమాదం కూడా ఏర్పడుతుంది. ఈ టెస్టింగ్ సాల్ట్ లో అన్ని ఎక్కువగా ఉండటం వల్ల అవి మన శరీరంలోకి వెళ్లిన తర్వాత పేగులను దెబ్బతినేలా చేస్తుందట.