ఓవ‌ర్ చేసిన‌ శివాజీ.. ఇబ్బందిగా ఫీల్ అయిన శుభశ్రీ..!!

బిగ్ బాస్ లో నాలుగో వారం నామినేషన్స్ మూడ్ నుంచి కంటెస్టెంట్స్ బయటకు వచ్చేశారు. పవర్ అస్త్ర పోటీలో బిజీ అయ్యారు. దాన్ని దక్కించుకునేందుకు నానా తిప్పలు పడుతున్నారు. బుధవారం ఈ తతంగమంతా నడిచింది. ఇంతకీ బిగ్ బాస్ లేటెస్ట్ ఎపిసోడ్ లో ఏం జరిగిందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. నామినేషన్స్ అయిపోవడంతో అందరూ నిద్రపోయారు. ఉదయం లేచిన దగ్గరనుంచి బుధవారం ఎపిసోడ్ ప్రారంభమైంది. ఇకపోతే నామినేషన్స్ లో భాగంగా గతంలో ప్రశాంత్, రతిక డ్రస్ పై చేసిన కామెంట్స్ బయటపడ్డాయి.

దీంతో రైతుబిడ్డ వరస మార్చాడు. ఇప్పటినుంచి అక్క అని మాత్రమే పిలుస్తానని రతికతో అన్నాడు. బుధవారం ఉదయం ఆమె దగ్గరకు వచ్చి క్షమించమని ప్రాధేయపడ్డాడు. కాసేపటికి ఆమె ఒప్పుకోవడంతో హమ్మయ్య అనుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. నాలుగో వారం పవర్ అస్త్ర పోటీలో భాగంగా బిగ్ బాస్ కొత్త టాస్క్ పెట్టాడు. శివాజీ, సందీప్, శోభా శెట్టి బ్యాంకర్స్ అని చెబుతూ.. వీళల్లో ఒక్కొక్కరి దగ్గర చిరు 10 వేల విలువైన బీబీ కాయిన్స్ ఉన్నాయని. వాటిని మిగతా కంటెస్టెంట్స్ కి ఇవ్వాల్సి ఉంటుందని అన్నాడు. ప్రతి కాయిన్ విలువ 100గా ఉంటుందని ప్రస్తావించాడు.

బ్యాంకర్స్ ఇచ్చిన కాయిన్స్.. తేజ- 51, గౌతమ్-24, ప్రియాంక-41, అమర్దీప్- 41, రతిక-35, యావర్ -43, ప్రశాంత్-33, శుభశ్రీ-31 అయితే కంటెస్టెంట్స్ గెలుచుకున్న కాయిన్స్ అన్నిటిని కౌంట్ చేసి బిగ్ బాస్ కి చెప్పమన్నారు. ఆ తర్వాత బ్యాంకులో డిపాజిట్ చేయమన్నారు. వాటికి కాపలాగా బ్యాంకర్స్ ఉన్నారు ‌. అయితే కాయిన్స్ కొట్టేద్దామని ప్లాన్లో భాగంగా శుభశ్రీ.. సేఫ్ దగ్గరకు వచ్చింది. ఈ క్రమంలోని శివాజీ ఆమె పైకి వెళ్ళాడు. దీంతో ఆమె కాస్త ఇబ్బంది పడ్డింది. కాసేపటికి భోజనం చేస్తూ శివాజీ బిహేవియర్ని బిగ్ బాస్ తో చెప్పుకొచ్చింది. బ్యాడ్ అని అంటూనే పైపైకి రావడం కరెక్టా? అమ్మాయి దగ్గరకొచ్చి అటాక్ చేయడం కరెక్టా? అది గేమ్ కాదు ఓవరాక్షన్ అని శివాజీ తీరుపై శుభశ్రీ వ్యాఖ్యలు చేసింది.

ఆ తర్వాత ఏటీఎం పెట్టి కాసుల శబ్దం వచ్చినప్పుడు ఆ ఏటీఎం ఎవరు ప్రెస్ చేస్తారో వారు… వారి జంటను, ఇంకో ఇద్దరినీ ఛాలెంజ్ చేయాల్సి ఉంటుందని బిగ్ బాస్ ఆదేశించాడు. అమర్దీప్ ఏటీఎం ని ఫస్ట్ ప్రెస్ చేశాడు. గౌతమ్ ని తన పార్ట్నర్ గా సెలెక్ట్ చేసుకున్నాడు అమర్… అపోనిట్స్ తేజ, రతికని సెలెక్ట్ చేసుకున్నాడు. రెడ్లైన్ దాటి ఎల్లో లైన్ మీద కూర్చుని ఎక్కువ ఎవరు స్మైలీ ఫొటోస్ ఇస్తే వారే విన్నారని అనౌన్స్ చేశాడు బిగ్ బాస్. ఈ గేమ్ లో అమర్దీప్, గౌతమ్ కృష్ణ గెలిచారు. రతిక, తేజ దగ్గరున్న కాయిన్స్ మొత్తం అమర్ వాళ్లకి ఇచ్చేయమని బిగ్ బాస్ ఆదేశించాడు. ఇక్కడతో బుధవారం ఎపిసోడ్ కంప్లీట్ అయ్యింది.