ప్రభాస్ రియాక్షన్ కోరుకుంటున్న ” పెద్దకాపు ” హీరో.. దేనికో తెలుసా..?

విరాట్ కర్ణ హీరోగా శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మించిన ” పెద్దకాపు “. ఈ సినిమా తొలి భాగం ” పెద్దకాపు 1 ” ఈనెల 29న ప్రేక్షకుల ముందుకి రానుంది. ఈ సందర్భంగా బుధవారం విలేకర్ల సమావేశంలో విరాట్ కర్ణ చెప్పిన విషయాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. చిన్నతనంలో క్రికెటర్ కావాలనుకున్నాను. కానీ కాలేజ్ పూర్తయ్యాక ” జయ జానకి నాయక ” సినిమా ప్రొడక్షన్ లోకి వచ్చాను.

నాలో నటించే ప్రతిభ కూడా ఉందని నిరూపించేందుకు ఓ యాక్షన్ షార్ట్ ఫిల్మ్ ను తీసుకొచ్చి మా బావ (మిర్యాల రవీందర్ రెడ్డి) గారికి చూపించాను. అది దర్శకులు శ్రీకాంత్ గారికి కూడా నచ్చడం,” పెద్దకాపు ” సినిమాకు ఓ కొత్త కుర్రాడిగా నేను నప్పుతానని ఆయన అనడంతో ఈ సినిమా మొదలైంది. ఈ సినిమాలో పెద్దకాపుగా నటించాను. 1980 బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా కథ జరుగుతుంది. అనేక సవాళ్లను ఎదుర్కొంటూ బలవంతుడితో పోరాడి ఓ సామాన్యుడు ఎలా ఎదిగాడు? అన్నదే ” పెద్దకాపు “కథ.

ఈ సినిమాకు నిర్మాత రవీందర్ రెడ్డి గారు కాకపోయినట్లయితే ఇంత కన్వాస్ దొరికేది కాదేమో. ఈ సినిమాలోని ఓ యాక్షన్ ఎమోషనల్ సీన్ ని నేను బాగా చేశానని.. నన్ను గ్రేడ్ ఏ యాక్టర్ గా సర్టి పై చేస్తున్నట్లుగా పీటర్ హెయిన్స్ గారు అన్నారు. అక్కడే ఉన్న రెడ్డి గారు కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. నేను ప్రభాస్ గారికి ఫ్యాన్ ని. ఈ సినిమా రిలీజ్ తర్వాత ఈ సినిమా పై ప్రభాస్ గారు స్పందిస్తే నా ఫీల్ వేరే లెవెల్ లో ఉంటుంది. త్వరలో ” పెద్దకాపు 2 ” షూటింగ్ ఆరంభమవుతుంది.అని చెప్పుకొచ్చాడు.