అత్తారింటికి దారేది సినిమా మేనియాలో కొట్టుకుపోయిన సినిమాలు ఇవే..!!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ,డైరెక్టర్ త్రివిక్రమ్ కాంబినేషన్లో జల్సా సినిమా తర్వాత వచ్చిన చిత్రం అత్తారింటికి దారేది.. ఈ సినిమా 2013 సెప్టెంబర్ 27న ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి విజయాన్ని అందుకుంది. అయితే 2013లో ప్రత్యేక తెలంగాణ కోసం జరుగుతున్న పోరాటంలో భాగంగా చాలా ఇబ్బందులు తలెత్తాయి అయితే అలాంటి సమయంలో ఊహించని విధంగా అత్తారింటికి దారేది సినిమా నెట్లో సగం చిత్రం లీక్ అయింది దీంతో అప్పటికప్పుడే రిలీజ్ డేట్ ను ప్రకటించిన చిత్ర బృందం ఈ సినిమాని విడుదల చేయడం జరిగింది.

Atharintiki Daaredi - Disney+ Hotstar

మినిమం కలెక్షన్స్ అన్న వస్తాయా రావా అనుకుంటున్న సమయంలో సెప్టెంబర్ 27న విడుదలైన ఈ సినిమా మొదటి షో తోనే బ్లాక్ బాస్టర్ విజయాన్ని అందుకుంది. ఫుల్ రన్ ట్రైన్ లో ఈ సినిమా అత్యధిక కలెక్షన్స్ను కూడా సాధించి ఇండస్ట్రీ హిట్టుగా నిలిచింది. ఈ సినిమాతో పవన్ కళ్యాణ్ రేంజ్ ఒక్కసారిగా పెరిగిపోయిందని చెప్పవచ్చు. ఈ సినిమాకి పోటీపడి చాలామంది స్టార్ హీరోల చిత్రాలు కూడా విడుదలయ్యాయి. కానీ ఇవేవీ పెద్దగా సక్సెస్ కాలేకపోయాయి వాటి గురించి తెలుసుకుందాం.

అత్తారింటికి దారేది సినిమా విడుదలైన తర్వాత విడుదలైన చిత్రాలలో ఎన్టీఆర్ నటించిన రామయ్య వస్తావయ్య సినిమా డిజాస్టర్ గా మిగిలింది.. నాగార్జున నటించిన భాయ్ సినిమా కూడా ఫెయిల్యూర్ గా నిలిచింది. శర్వానంద్ నటించిన సత్య-2 సినిమా డిజాస్టర్ గా మిగిలింది అలాగే ప్రియమైన నటించిన లేడీ ఓరియంటెడ్ సినిమా చండీ కూడా స్నాప్ గా నిలిచింది ఇవే కాకుండా చాలా చిన్న సినిమాలు కూడా విడుదలై అత్తారింటికి దారేది సినిమా రిలీజ్ మానియాలో కొట్టుకుపోయాయి.