రైతు బిడ్డ తలకు గాయం.. కుప్పకూలిన ప‌ల్ల‌వి ప్రశాంత్..!!

బిగ్ బాస్ హౌస్‌లో టాస్కులు అంటే కాస్త కఠినంగానే ఉంటాయి. గెలవడం కోసం కంటెస్టెంట్స్ ఏమైనా చేస్తారు. బిగ్ బాస్ ఏడో సీజన్లో ప్రారంభం నుంచి కాస్త కఠినమైన టాస్కులు ఇస్తున్నారు బిగ్ బాస్. తాజాగా పవర్ అస్త్ర గెలవడం కోసం ఇచ్చిన టాస్క్ లో పల్లవి ప్రశాంత్ గాయపడ్డాడు. తలకు తీవ్ర గాయం కావడంతో కొప్పకూలిపోయినట్లు తాజాగా విడుదలైన ప్రోమోలో చూపించారు. బిగ్ బాస్ హౌస్ లో మొత్తం 14 మంది పాల్గొన్నారు.

అయితే వారంతా పోటీ దారులు మాత్రమే.. ఇంటి సభ్యులు కావాలంటే బిగ్‌బాస్ పెట్టిన టాస్కులు గెలవాల్సిందే. పవర్ అస్త్ర గెలిస్తే.. కొన్ని సదుపాయాలు ఉంటాయి. అందుకే పవర్ అస్త్ర కోసం కంటెస్టెంట్స్ పోటీపడి మరి గేమ్ ఆడుతున్నారు. ఇప్పటికే సందీప్, శివాజీ, శోభా శెట్టి పవర్ అస్త్ర గెలిచారు. ఇక నాలుగో పవర్ అస్త్ర కోసం ఈ వారం పోటీ పడుతున్నారు. నాలుగో పవర్ అస్త్ర కంటైనర్ ని సెలెక్ట్ చేయడం కోసం బిగ్ బాస్ హౌస్ ని బ్యాంక్‌గా మార్చారు.

బ్యాంకర్స్ గా శివాజీ, సందీప్, శోభా శెట్టి వ్యవహరించమని బిగ్ బాస్ ఆదేశించాడు. మిగతావారు బీబీ కాయిన్స్ సేకరించాల్సి ఉంటుంది. ఆట ముగిసేసరికి ఎవరి దగ్గర ఎక్కువ బీబీ కాయిన్స్ ఉంటే వారు నాలుగో పవర్ అస్త్ర కంటైనర్ గా నిలుస్తారు. ఈ టాస్క్ కోసం గార్డెన్ ఏరియాలో ఏటీఎం ఏర్పాటు చేశారు. బజర్ మూగగానే ముందుగా ఎవరు వెళ్లి ఏటీఎంని ప్రెస్ చేస్తారు వారు విన్నరని అనౌన్స్ చేశాడు బిగ్ బాస్. ముందుగా అమరదీప్ వెళ్లి ప్రెస్ చేశాడు. ఈ నేపథ్యంలోనే పల్లవి ప్రశాంత్ తలకు గాయమైంది.