కన్న కొడుకు జీవత్సవంలా.. నటుడు నాజర్ కన్నీటి గాధ..!!

స్టార్ యాక్టర్ నాజర్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో నాజర్ ఎంత పాపులారిటీ దక్కించుకున్నాడు అందరికీ తెలుసు. నాజర్ వరుసగా సినిమాల్లో నటిస్తూ తన క్రేజ్ ను పెంచుకుంటున్నాడు. ప్రతి మనిషి జీవితంలో సుఖాలు ఎలా ఉంటాయో కష్టాలు కూడా అలానే ఉంటాయి అదే విధంగా సినీ సెలబ్రిటీస్ జీవితాలు కూడా పైకి వెలుగుతూ కనిపించిన లోపాల కన్నీటి గాథలు ఎన్నో ఉంటాయి. ఇక నాజర్ జీవితంలో కూడా అలాంటి విషాదం ఉంది. కానీ ఇది చాలా తక్కువ మందికి తెలుసు.

నాజర్‌కు ముగ్గురు కొడుకులు నూరుల్ హసన్, లుఫ్లిన్, అభి మెహ‌తి హసన్ వీరిలో పెద్ద కొడుకు తప్ప నాజర్ ఇద్దరు కొడుకులు హీరోలుగా మారారు. ప్రస్తుతం నట్లుగా కొనసాగుతున్నారు. ఇక నాజరు పెద్ద కొడుకు విషయంలోనే విషాదం జరిగింది. నోరుల హాసన్ చిన్నప్పటినుంచి తండ్రిని చూస్తూ పెరిగి హీరోగా మారాలనుకున్నాడు. కొడుకు కోరికను నాజర్ కాదనలేకపోయాడు. అన్ని ఓకే అనుకుని హీరోగా లాంచ్ చేసే సంవత్సరంలో అతనికి పెద్ద కార్ యాక్సిడెంట్ అయ్యి అబ్దుల్ తీవ్రంగా గాయపడ్డాడట.

నిజం చెప్పాలంటే జీవచ్ఛవంగా మారిపోయాడు. గతం గుర్తులేదు సొంత తల్లిదండ్రులను కూడా గుర్తుపట్టలేని స్థితిలోకి వెళ్లిపోయాడు. తల్లిదండ్రులకు అంతకు మించిన నరకం మరొకటి ఉండదు అని చెప్పాలి. అయినా కొడుకు ప్రాణాలతోనే ఉన్నాడని నాజర్ కుటుంబం సంతోష పడింది. 2014లో జరిగిన ఈ ప్రమాదం నాజర్ కుటుంబాన్ని కన్నీటి పర్యంతం చేసింది. చేతికి అందించిన కొడుకు ఇలా జీవత్వంలో మారడం చూసి నాజర్‌ కృంగిపోయాడు. ఇక అప్పటినుంచి ఇప్పటివరకు అత‌డిని ను వారు చిన్న పిల్లాడిలా చూసుకుంటూ వస్తున్నారు.

ఇక్కడ ఆశ్చ‌ర్య‌క‌ర‌మైన‌ విషయం ఏంటంటే అతడు ఎవరు గుర్తు లేకపోయినా హీరో విజయ్ మాత్రం గుర్తున్నాడు. ఆయన కనిపిస్తే ఆనందంతో ఎగిరే గంతులు వేస్తాడట. ఈ విషయం తెలిసి విజయ్ ఈ ఏడాది నాజర్ పెద్ద కొడుకు పుట్టిన రోజు వేడుకల్లో పాల్గొన్నాడు. ఇక ఈ విషయం తెలియడంతో నాజర్ అభిమానులు కన్నీళ్లు పెట్టుకున్నారు. ఏదేమైనా కుటుంబం సంతోషంగా ఉండాలని కామెంట్స్ చేస్తున్నారు.