ఐ లవ్ యు చెబుతున్న ఇద్దరు హీరోలు.. వాష్ రూమ్ నుంచి బయటకు రమ్మన్న డైరెక్టర్.. అసలు ఏం జరిగిందంటే….!!

తమిళ దర్శకుడు అట్లీ, షారుఖ్ ఖాన్ కాంబినేషన్లో ఇటీవల వచ్చిన సినిమా ” జవాన్ “. ఈ సినిమా డిసెంబర్ 7న థియేటర్లో విడుదలై హిట్ టాక్ తో దూసుకుపోతుంది. అంతేకాకుండా కలెక్షన్స్ రాబడుతూ బాక్స్ ఆఫీస్ ను బద్దలు కొడుతుంది. ఈ సినిమా 1000 కోట్ల కలెక్షన్స్ సాధించి సరికొత్త రికార్డును సృష్టించింది. ఇక అట్లితో ఎక్కువ సినిమాలు చేసిన హీరో విజయ్ దళపతి కావడంతో, అతని అభిమానులు జవాన్ సక్సెస్ను తెలుపుతూ సోషల్ మీడియాలో షారుఖ్ ఖాన్ కి అభినందనలు తెలుపుతూ పలు పోస్టులు పెడుతున్నారు.

వాటికి షారుఖ్ స్పందిస్తూ…”చాలా థాంక్స్ తలపతి విజయ్ నెక్స్ట్ మూవీ కోసం నేను ఎంతో ఎదురు చూస్తున్నాను ఐ లవ్ యు విజయ్ సార్ ” అంటూ ట్విట్ చేశాడు. కాగా షారుఖ్ ఖాన్ చేసిన ఈ మెసేజ్ కు హీరో విజయ్ సైతం స్పందించాడు. ” జవాన్ సినిమా భారీ విజయాన్ని అందుకున్నందుకు టీం మొత్తానికి కంగ్రాట్స్ చెప్పాడు. నేను కూడా మిమ్మల్ని ప్రేమిస్తున్నాను షారుఖ్ సార్ ” అని రిప్లై ఇచ్చాడు.

ప్రస్తుతం వీరిద్దరి పోస్ట్లు నెట్టింట వైరల్ గా మారాయి. అయితే ఈ పోస్టులను చూసిన డైరెక్టర్ రాజ్ కుమార్ హిరాని.. ” సర్జీ బాత్ రూమ్ నుంచి బయటకి రండి. లోపల ఏం చేస్తున్నారు. ట్రైలర్ చూస్తున్నారా..? ” అని ఫన్నీ ట్వీట్ చేశాడు. దీనికి షారుఖ్ బదిలిస్తూ…”వచ్చేస్తున్నా సార్. బై బాయ్స్ ” అంటూ షారుఖ్ సెషన్ ఎండ్ చేశారు.