” స్కంద ” ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్… సీక్వెల్ అనౌన్స్ చేసిన బోయపాటి… ఇక మామూలుగా ఉండదుగా….!!

టాలీవుడ్ యంగ్ అండ్ డైనమిక్ హీరో రామ్ పోతినేని, బోయపాటి శ్రీను కాంబినేషన్లో రూపొందిన సినిమా ” స్కంద “. శ్రీ లీల, సాయిమంజ్రేకర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీ భారీ అంచనాలతో… తెలుగుతోపాటు పాన్ ఇండియా లెవెల్ లో గురువారం (ఈరోజు) రిలీజ్ అయింది.

ఇక కెరియర్లో ఫస్ట్ టైం డిఫరెంట్ వేరియేషన్స్ తో క్యారెక్టర్ లో రామ్ న‌టించాడు. ఇక‌ర ఈ సినిమా అభిమానులతో పాటు మాస్ ఆడియన్స్‌ను కూడా ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఇటు కథ రొటీన్ గానే ఉన్నా… మాస్ సీన్స్, యాక్షన్ ఎపిసోడ్స్ తో డైరెక్టర్ మెప్పించాడు.

తమన్ బీజీఎమ్ కూడా మంచి ప్లస్ అయింది. ఇదంతా ఒక ఎత్తైతే సినిమా క్లైమాక్స్ లో సీక్వెల్ పై అదిరిపోయే అప్డేట్ ఇచ్చి ఆడియన్స్‌ని సప్రైజ్ చేశారు రామ్, బోయపాటి శ్రీను. ” స్కంద 2 ” ఉంటుందని అనౌన్స్ చేశారు. దీంతో రామ్ ఫ్యాన్స్ ఖుషి అవుతున్నారు.