రూ. 29 లక్షల కేసు విషయంలో.. ఏఆర్ రెహ్మాన్ పై ఫిర్యాదు.. అసలేం జరిగిందంటే..?

సంగీత దర్శకుడు ఏఆర్ రెహ్మాన్ పై చైన్నె పోలీస్ కమిషనర్ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. వివరాలు, శస్త్ర చికిత్స వైద్య నిపుణుల సంఘం 2018లో ఏఆర్ రెహ్మాన్ తో ఒక సంగీత కచేరిని తల‌పెట్టింది. అందుకు అడ్వాన్స్‌గా రెహ్మాన్‌కు రూ. 29.50 లక్షలు ఇచ్చారు. అయితే అనివార్య కారణాలవల్ల ఆ సంగీత కచ్చేరి రద్దు అయ్యింది.

కాగా రెహ్మాన్ కు ఇచ్చిన అడ్వాన్స్ నగదును తనకు తిరిగి ఇవ్వలేదని, చెల్లించేలా చర్యలు తీసుకోవాలంటూ వైద్యాన్నిపుణుల సంఘం నిర్వహకులు ఫిర్యాదులో పేర్కొన్నారు. కాగా ఇటీవల ఏఆర్ రెహ్మాన్ చెనైలో నిర్వహించిన సంగీత కచ్చేరి రసాభసగా మారిన విషయం మనందరికీ తెలిసిందే.

పరిమితికి మించిన టికెట్లు విక్రయించడం వల్ల టికెట్ల కొనుగోలు చేసిన చాలామంది సంగీత కచ్చేరి ఆవరణలోకి వెళ్లలేక అసంతృప్తితో వెనుదిరిగారు. ఈ వ్యవహారం పోలీసుల విచారణ వరకు వెళ్ళింది. హా సంఘటనపై ఏఆర్ రెహ్మాన్ క్షమాపణ చెప్పిన చాలా మంది సంగీత ప్రియులు ఆయనపై అసంతృప్తిని వ్యక్తం చేశారు.