వైరల్ అవుతున్న తమన్నా కామెంట్స్…అసలామె ఏమన్నదంటే?

సౌత్ సినీ పరిశ్రమలపై మిల్కీ బ్యూటీ తమన్నా ఆశ్చర్యకరమైన కామెంట్స్ చేసింది. ఈమె చేసిన కామెంట్స్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఇంతకీ అసలు తమన్నా ఏమంది? ఇంతగా ఆమె మాటలు వైరల్ అవ్వటానికి గల కారణం ఏమిటి? ఈ మధ్య తమకు అన్నం పెట్టిన సౌత్ ఇండస్ట్రీలను మర్చిపోయి, బాలీవుడ్ కి వెళ్ళగానే, ఇక్కడి విధానాలను, వ్యక్తులను దూషించడం హీరోయిన్స్ కు కామన్ ఐపోయింది. మొన్న తాప్సి, నిన్న రష్మిక, నేడు తమన్నా….ఇక ప్రతిఒక్కరు సౌత్ సినిమా ఇండస్ట్రీలపై కామెంట్స్ చేస్తూ పోతున్నారు. తాజాగా తమన్నా ఒక ఇంటర్వ్యూ లో సౌత్ ఇండస్ట్రీలపై ఘాటు వ్యాఖ్యలు చేసింది. తమన్నా చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

 

తమన్నా నటించిన మొదటి చిత్రం “చాంద్ సె రోషన్ చెహ్రా”. ఇది ఒక బాలీవుడ్ చిత్రం. మొదటి చిత్రం విఫలం కావడంతో తెలుగు పరిశ్రమలో అడుగు పెట్టింది తమన్నా. ఇక్కడ వరుస విజయాలు సాధించి మంచి క్రేజ్ సంపాదించుకుంది. తరువాత తమిళ సినిమాలు కూడా చేయడం మొదలుపెట్టింది. సినీ పరిశ్రమలో అడుగుపెట్టి సుమారు 16 ఏళ్ళు కావస్తున్నా, ఇంకా మంచి క్రేజ్ ఉన్న హీరోయిన్ గా చలామణి అవుతుంది తమన్నా. తెలుగు, తమిళ భాషలలో అందరు స్టార్ హీరోలతో నటించింది. ఈమె ప్రస్తుతం “బృందా”, “అరణ్మనై 4”, “వేడా” అనే చిత్రాలలో నటిస్తుంది.

 

ఐతే బాలీవుడ్ లోను మరియు దక్షిణాది లోను వరుస అవకాశాలతో బిజీ గా ఉంటున్న తమన్నా, ఒక ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ సౌత్ ఇండస్ట్రీ గురించి మాట్లాడారు. ఒక నటి అవ్వాలని పరిశ్రమలో అడుగుపెట్టి, ఈరోజు స్టార్ గా ఎదిగానని అన్నారు తమన్నా. తనకు ఇప్పటికి చాలా ఆఫర్స్ వస్తున్నా, కావాలనే కొన్ని సినిమాలను వదిలేసుకుంటున్నానని అన్నారు తమన్నా. అందుకు కారణం చెప్తూ, సౌత్ ఇండస్ట్రీలలో పురుషాధిక్యం ఎక్కువ అని అన్నారు. హీరోస్ కి ఎక్కువగా ప్రాధాన్యం ఇచ్చి, సెలెబ్రేట్ చేసుకుంటారని అన్నారు. తమన్నా కెరీర్ బాలీవుడ్ తో మొదలైనప్పటికీ, ఆమెకు సౌత్ లో ఉన్న క్రేజ్ బాలీవుడ్ లో లేదు. ఈ విషయం పై స్పందిస్తూ, తాను సక్సెస్ ని ఫెయిల్యూర్ ని పర్సనల్ గా తీసుకోనని అన్నారు తమన్నా. తాను బాలీవుడ్ లో చేసిన సినిమాలు ఆశించిన విజయాన్ని సాధించకపోయినప్పటికీ, అది కేవలం తన తలరాత అని వదిలేస్తానని అన్నారు.