జపాన్ ” సపోరో స్నో ఫెస్టివల్ ” కు సాయి పల్లవి..‌!!

స్టార్ హీరోయిన్ సాయి పల్లవి నటిస్తున్న లేటెస్ట్ మూవీ కి సంబంధించిన మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇప్పుడు సోషల్ మీడియాలో నెట్టింట వైరల్‌గా మారింది. బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ కొడుకు జునైద్ ఖాన్ ప్రాజెక్టులో సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తున్న సంగతి మన అందరికీ తెలిసిందే. కాగా బ్యూటిఫుల్ లవ్ స్టోరీ గా రాబోతున్న ఈ సినిమాకి సునీల్ పాండే దర్శకత్వం వహిస్తున్నాడు.

అయితే యశ్ రాజ్ ఫిల్మ్‌స్ బ్యానర్ లో వస్తున్న ఈ ప్రాజెక్టు ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. అలాగే షూటింగ్ కి సంబంధించిన ఓ సాలిడ్ న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ మేరకు మూవీ షూటింగ్ జపాన్లో జరుగుతున్నట్లు తెలుస్తుండగా.. అక్కడ ప్రతి సంవత్సరం ఫిబ్రవరిలో ” సపోరో స్నో ఫెస్టివల్ ” జరుగుతుంది.

ఈ ఫెస్టివల్‌ను చూడడానికి ప్రపంచం నలుమూలల నుంచి పర్యాటకులు జపాన్ కు వెళ్తుంటారు. అయితే ఈ ఫెస్టివల్ లోనే జునైద్, సాయి పల్లవిలపై కొన్ని రొమాంటిక్ సన్నివేశాలను చిత్రీకరించేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. మరి ఇందులో ఎంతవరకు నిజం ఉందో లేదో అఫీషియల్ అనౌన్స్మెంట్ రావాల్సి ఉంది.

 

 

View this post on Instagram

 

A post shared by Sai Pallavi (@saipallavi.senthamarai)