శ్రీదేవి చనిపోయిన తన చెల్లెలు రాకపోవడానిక కారణం అదేనట..!!

టాలీవుడ్ హీరోయిన్ల అతిలోకసుందరి శ్రీదేవి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. శ్రీదేవి తమిళనాడులో మీనం పట్టి గ్రామంలో అయ్యప్ప, రాజేశ్వరి దంపతులకు జన్మించారు. వీరిలో పెద్ద కుమార్తె శ్రీదేవి అయితే ఆమె సోదరి శ్రీలత.. అయితే ఈమె గురించి చాలా మందికి తెలియకపోవచ్చు ఎందుకంటే శ్రీదేవి లాగా ఇమే ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వలేదు కనుక ఏ సినిమాకి వెళ్ళినా కూడా అక్కతోపాటు ఎక్కువగా కనిపించేదట శ్రీలత.. శ్రీలత దాదాపు 1972 నుంచి 1993 వరకు సినిమా సెట్ లో శ్రీదేవితో పాటు ఉండేదట.

Here's why Sridevi's sister Srilatha has been silent about her death

అలా 21 ఏళ్లు పాటు అక్క సినీ ప్రస్థానంలో ఎంతో తోడుగా నిలిచిన శ్రీలత, శ్రీదేవి కెరియర్ ప్రారంభం నుంచి ప్రతి ఒక్క సెట్లో కూడా శ్రీలత కనిపిస్తూ ఉండేదట. శ్రీలత కూడా శ్రీదేవి లాగి నటి కావాలని కోరుకునేది కానీ ఆ విషయంలో సక్సెస్ కాలేకపోయింది. ఆ తర్వాత శ్రీదేవికి మేనేజర్ గా మారిపోయింది. శ్రీదేవి తల్లి రాజేశ్వరి మరణం తర్వాత వీరిద్దరి మధ్య దూరం పెరిగిపోయిందని తెలుస్తోంది. తల్లి మరణంతో ఇద్దరి సోదరుల మధ్య పలు రకాల విభేదాలు కూడా వచ్చాయట.

What's the reason behind Sridevi's sister Srilatha's silence over the  actress' death | Bollywood News – India TV

శ్రీదేవి తల్లి అనారోగ్యంతో ఉండగా ఒకసారి ఆపరేషన్ చేయాలని హాస్పిటల్లో చేర్పించారట. ఆ సమయంలో డాక్టర్ చేసిన తప్పుకు ఆమె తల్లి జ్ఞాపకశక్తి కోల్పోయిందట ఆ తర్వాత కోలుకోలేక 1996లో శ్రీదేవి తల్లి మరణించిందట. దీంతో శ్రీదేవి ఆసుపత్రి పైన కేసు పెట్టాలని వచ్చిన ఈ కేసులో చివరికి శ్రీదేవి గెలిచింది తల్లి మరణంతో పరిహారంగా రూ .7 కోట్ల రూపాయలు పొందింది. అయితే ఈ డబ్బుని తన వద్ద ఉంచుకుందని శ్రీదేవి చెల్లెలు శ్రీలత ఆరోపించింది దీంతో అక్క చెల్లెల మధ్య విభేదాలు వచ్చాయట. అంతేకాకుండా ఆస్తి మొత్తాన్ని కూడా తన పేరు మీదికి శ్రీదేవి బదిలీ చేసిందని ఆరోపించింది. అల వీరిద్దరి మధ్య విభేదాలు రావడంతో చివరికి శ్రీదేవి మరణించిన కూడా శ్రీలత చూసే కి రాలేదని చెబుతూ ఉన్నారు.