రచ్చ సినిమాలో తమన్న క్యారెక్ట‌ర్‌లో నటించిన ఈ చిన్ని పాప ఇప్పుడు టాలీవుడ్‌ హీరోయిన్.. గుర్తుప‌ట్టారా..

సినీ ఇండస్ట్రీలో చాలామంది చైల్డ్ ఆర్టిస్టులు స్టార్ హీరో, హీరోయిన్ల చిన్ననాటి పాత్రలో నటిస్తూ ఫేమస్ అవుతూ ఉంటారు. అలా ఇటీవల కాలంలో హీరోయిన్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్న‌ వారిలో గంగోత్రి సినిమాలో చైల్డ్ ఆర్టిసిగా నటించిన కావ్య కళ్యాణ్రామ్ ఒకరు. ఇటీవల ఆమె నటించిన బలగం సినిమాతో హీరోయిన్గా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇలానే మరి కొంతమంది ఇండస్ట్రీలో రాణిస్తుంటే కొంతమంది మాత్రం పెద్దపెద్ద చదువులు చదువుతూ జాబ్ చేస్తూ ఫారన్‌ కంట్రీస్‌లో సెటిలైపోతున్నారు.

అలా ఒకప్పుడు రచ్చ సినిమాలో తమన్నా క్యారెక్టర్ లో చేసిన చైల్డ్ ఆర్టిస్ట్ ప్రస్తుతం స్టార్ హీరోయిన్ అంటూ న్యూస్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. మరి రచ్చ సినిమాలో తమన్నా క్యారెక్టర్ లో చేసిన చైల్డ్ ఆర్టిస్ట్ పేరేంటి.. ఆమె ఇప్పుడు ఏ సినిమాలో హీరోయిన్.. ఒకసారి తెలుసుకుందాం. రామ్‌చరణ్, తమన్న కాంబినేషన్లో వచ్చిన రచ్చ సినిమా సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందా. ఈ సినిమాలో తమన్నా క్యారెక్టర్ లో చిన్నప్పటి పాత్ర చేసిన అమ్మాయి పేరు విషికా లక్ష్మణ్. ఈమె ప్రస్తుతం ఏందిరా ఈ పంచాయతీ, సగిలేటి కథ లాంటి సినిమాల్లో హీరోయిన్గా నటిస్తోంది.

రీసెంట్గా ఓ ఇంటర్వ్యూలో వ‌షికా మాట్లాడుతూ నేను రచ్చ సినిమా కాకుండా ఇంకా చాలా సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్‌గా నటించానని కానీ రచ్చ సినిమా నే నేను చేసిన చివరి సినిమా అంటూ చెప్పుకొచ్చింది. తర్వాత చదువులో బిజీ అయిన నేను రచ్చ సినిమా టైంలో రామ్ చరణ్ గారిని గాని, తమన్నని గాని కలవలేదని అసలు ఆ షూటింగ్ టైంలో వాళ్లు అక్కడ లేనే లేరని వివరించింది. ఇప్పుడు వాళ్ళు నన్ను చూసినా కూడా గుర్తుపట్టరు ఎందుకంటే చిన్నప్పుడు వేరేలా ఇప్పుడు వేరేలా ఉన్నాను అంటే చెప్పుకొచ్చింది. ప్రస్తుతం విషిక లక్ష్మణ్ చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.