తమ్ముళ్లపై జనసేన డౌట్..అక్కడే తేడా కొడుతోంది?

టీడీపీ-జనసేన పొత్తు సఫలం అవుతుందా? రెండు పార్టీల విభేదాలు వల్ల విఫలం అవుతుందా? అంటే ఎక్కువ శాతం విఫలమయ్యేలా ఉంది. ఎందుకటే అధినేతలు కలిశారు కానీ..కింది స్థాయి కార్యకర్తలు కలవడంలేదు. చంద్రబాబు, పవన్ మధ్య సఖ్యత ఉంది. కానీ టి‌డి‌పి, జనసేన కార్యకర్తల మధ్య సమన్వయం లేదు. అందుకే ఇటీవల పవన్ సైతం జనసేన శ్రేణులకు క్లాస్ ఇచ్చారు. ఎందుకంటే జైలుకు వెళ్ళి బాబుని పలకరించి పవన్ ప్రెస్ మీట్ పెట్టినప్పుడు..పవన్ మధ్యలో ఉండగా అటు లోకేష్, ఇటు బాలయ్య ఉన్నారు.

దీంతో పవన్‌ని పెద్దగా చేసి జనసేన శ్రేణులు ప్రచారం చేశాయి. అందుకే పవన్, తమ పార్టీ వాళ్ళకు క్లాస్ ఇచ్చారు. టి‌డి‌పి వాళ్ళు ఇబ్బందుల్లో ఉన్నారు. అలా అని వాళ్ళని కించపరిచేలా పోస్టులు చేయకూడదని అన్నారు. అయితే తమ్ముళ్ళు సైతం జనసేన శ్రేణులు తమ బలాన్ని ఎక్కువగా ఊహించుకుంటున్నాయని ఫైర్ అవుతున్నారు. పైగా పవన్ సి‌ఎం అంటూ ప్రచారం చేస్తున్నారని మండిపడుతున్నారు. ఇలా రెండు పార్టీల మధ్య సఖ్యత లేదు.

 

ఎన్నికల సమయంలో ఇదే రచ్చ జరిగితే నష్టం తప్పదు. పైగా జనసేనకే ఎక్కువ నష్టమని చెప్పాలి. జనసేన పోటీ చేసే సీట్లలో టి‌డి‌పి ఓట్లు బదిలీ కాకపోతే నష్టం తప్పదు. అయితే టి‌డి‌పి పోటీ చేసే సీట్లలో జనసేన ఓటింగ్ తక్కువగానే ఉంటుంది. కాబట్టి పెద్దగా ప్రభావం ఉండదు. కానీ జనసేన పోటీ చేసే సీట్లలో టి‌డి‌పి ఓటింగ్ ఎక్కువ.

ఉదాహరణకు పొత్తులో భాగంగా విజయవాడ వెస్ట్ సీటు జనసేనకు ఇస్తారని అంటున్నారు. గత ఎన్నికల్లో అక్కడ వైసీపీకి 58 వేలు, టి‌డి‌పికి 50 వేలు, జనసేనకు 22 వేలు ఓట్లు పడ్డాయి. టి‌డి‌పి-జనసేన కలిస్తే గెలుపు ఖాయమే. కానీ జనసేన పోటీ చేస్తే..టి‌డి‌పికి ఉన్న 50 వేల ఓట్లు బదిలీ కావాలి. అది అంత తేలికగా జరగదు. కాబట్టి తమ్ముళ్ళు..జనసేనకు దెబ్బవేసే ఛాన్స్ ఉంటుంది.