త్రిష ని పెళ్లి చేసుకోబోయే వరుడు ఎవరో తెలుసా..?

టాలీవుడ్ కోలీవుడ్ ప్రేక్షకులకు హీరోయిన్ త్రిష గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎన్నో చిత్రాలలో నటించి బ్లాక్ బాస్టర్ విజయాలను కూడా అందుకుంది ఈ ముద్దుగుమ్మ. త్రిష సినిమాల పరంగా ఎలా ఉంటుందో ఎఫైర్ల విషయంలో కూడా తరచూ ఈమె పేర్లు వినిపిస్తూనే ఉంటాయి. టాలీవుడ్ లో దాదాపుగా అగ్ర హీరోలు అందరు సరసన నటించిన త్రిష నటనపరంగా మంచి క్రేజ్ సంపాదించుకుంది.అయితే వయసు మీద పడుతున్న కొద్ది ఈమె అందంలో మాత్రం ఎలాంటి మార్పు కనిపించడం లేదు.

గతంలో కూడా తమిళ పారిశ్రామికవేత్త మణియన్ ను వివాహం చేసుకోవాలని ఉద్దేశంతో ఎంగేజ్మెంట్ కూడా చేసుకుని త్రిష ఆ తర్వాత కొన్ని కారణాల చేత పెళ్లిని రద్దు చేసుకోవడం జరిగింది. అప్పటినుంచి ఇప్పటివరకు త్రిష పెళ్లి విషయంపై ఎప్పుడూ కూడా స్పందించలేదు మళ్లీ ఇంత కాలానికి త్రిష మనసులో పెళ్లి ఆశలు మొదలయ్యాయని వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. కోలీవుడ్లో అందుతున్న సమాచారం ప్రకారం త్రిష కేరళలోని మలయాళ సినీ పరిశ్రమకు చెందిన ఒక నిర్మాతను ఇమే వివాహం చేసుకోవడానికి చూస్తోంది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి.

అయితే ఇప్పటివరకు కేవలం మాటల వరకే పరిమితమైంది అన్నట్లుగా తెలుస్తోంది .త్వరలోనే అధికారికంగా ప్రకటన వెలుపడే అవకాశం ఉన్నట్లు కోలీవుడ్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి.మరి ఈసారైనా త్రిష వివాహం చేసుకొని బ్యాచిలర్ లైఫ్ కి దూరంగా ఉంటుందేమో చూడాలి మరి. ఏదిఏమైనా త్రిష పెళ్లి చేసుకోబోతుందనే విషయం అభిమానులకు తెలియగానే తెగ సంబరపడిపోతున్నారు. మరి ఇందులో ఎంత నిజం ఉందో తెలియాల్సి ఉన్నది. ప్రస్తుతం విజయ దళపతి నటిస్తున్న లియో సినిమాలో హీరోయిన్గా నటిస్తోంది త్రిష.