దేవకన్య రూపంలో కనిపించిన సీతారామం హీరోయిన్.. ఫాన్స్ ఫిదా..

టెలివిజన్, సినిమా రెండింటిలోనూ తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్న నటి మృణాల్ ఠాకూర్ తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్‌లో కొన్ని బ్యూటిఫుల్ ఫొటోలు షేర్ చేసింది. ఆ ఫొటోల్లో ఈ ముద్దుగుమ్మ పింక్ గౌనులో దేవకన్య లాగా కనిపించింది. ఆమె వెనుక ఉన్న ప్రకృతి అందాలను ఆమెని మరింత అందంగా మార్చాయి. సీతా రామం చిత్రంతో తెలుగులోకి అరంగేట్రం చేసిన ఈ నటి తన బ్యూటీకి సరిపోయే ఫ్లెమింగో పింక్ దుస్తులను ధరించింది. జుట్టును వెనుకకు కట్టి చాలా అందంగా కనిపించి కట్టిపడేసింది. ఆమె వివిధ ప్రదేశాలలో పోజులిచ్చింది, ప్రతి ఒక్కటి ప్రకృతిని, దానితో ఆమెకున్న అనుబంధాన్ని ప్రదర్శిస్తుంది.

ఒక ప్రదేశంలో, ఆమె చుట్టూ పచ్చదనంతో కూడిన ప్రశాంతమైన సరస్సు దగ్గర నిలబడి కనిపించింది. ఈ టాలెంటెడ్ ముద్దుగుమ్మకు నేచర్ సరైన బ్యాక్‌గ్రౌండ్ అని అనిపించేలా ఈ ఫొటోలు కనిపించాయి. ప్రస్తుతం ఆ ఫోటోలన్నీ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇవి చూసి సూపర్ గా ఉన్నారు మేడం ఉంటూ చాలా మంది కామెంట్లు చేస్తున్నారు.

31 ఏళ్ల మృణాల్ ఠాకూర్ 2018లో లవ్ సోనియాతో హిందీ సినిమాల్లో అడుగు పెట్టడానికి ముందు టీవీ సీరియల్స్‌లో తన కెరీర్‌ను ప్రారంభించింది. ప్రస్తుతం ఈ తారా నానితో కలిసి తెలుగులో హాయ్ నాన్నా అనే సినిమా చేస్తోంది. ఈ మూవీతో ఈ ముద్దుగుమ్మ హిట్ కొడితే తెలుగులో అవకాశాలు మరిన్ని వచ్చే ఛాన్స్ ఉంది. ఇక హిందీలో ఈ తార పూజా మేరీ జాన్, పిప్పా అనే సినిమాలు చేస్తోంది. విజయ్ దేవరకొండ తో కూడా కలిసి ఒక టాలీవుడ్ మూవీలో యాక్ట్ చేస్తోంది.

 

 

View this post on Instagram

 

A post shared by Mrunal Thakur (@mrunalthakur)