ఇట్లాంటిది ఎన్నడూ చేయలే.. ఆ సిరీస్‌పై అవికా గోర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..

అవికా గోర్‌ గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన పనిలేదు. సినిమా చూపిస్త మామ వంటి సినిమాలతో ఈ ముద్దుగుమ్మ తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఇప్పుడు మరో అదిరిపోయే సిరీస్ తో తెలుగు ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమయ్యింది.

ఓంకార్ దర్శకత్వంలో కొత్త తెలుగు వెబ్ సిరీస్ అయిన మాన్షన్ 24లో నటించేందుకు చాలా ఎగ్జైటింగ్ గా ఉన్నానని తాజాగా అవికా గోర్ తెలిపింది. ఆమె గతంలో రాజు గారి గది 3 చిత్రంలో ఓంకార్‌తో కలిసి పనిచేసింది. మళ్లీ హారర్ థ్రిల్లర్ జానర్‌లో అతడితో కలిసి పని చేస్తుంది. ఈ సిరీస్ లో పోస్టర్‌లో అవికా ఇంటెన్స్ , మిస్టీరియస్ లుక్‌లో కనిపిస్తోంది. ఇది తాను ఇప్పటివరకు నటించిన వాటన్నిటిలో అత్యంత ఇంటెన్స్ పోస్టర్ అని ఆమె చెప్పింది. ఇలాంటి ఇంటెన్స్‌ డ్రామాల్లో తాను ఎప్పుడూ నటించలేదని పేర్కొంది.

మాన్షన్ 24తో పాటు, అవికా హిందీ, తెలుగు సినిమా, వెబ్ సిరీస్‌లలో కూడా పనిచేస్తోంది. వివిధ ప్లాట్‌ఫామ్‌లలో నటీనటులకు లభించే అవకాశాల గురించి ఆమె రీసెంట్ ఇంటర్వ్యూలో మాట్లాడింది. త్వరలో తన అప్‌కమింగ్ ప్రాజెక్ట్‌ల గురించి మరిన్ని ప్రకటిస్తానని కూడా తెలిపింది.

అవికా ప్రస్తుతం నటిగా చాలా బిజీగా సమయం గడుపుతోంది. ఆమెకు చాలా అరుదుగా సెలవులు వస్తాయి. వినాయక చవితి సమయంలో కూడా ఆమె తన ప్రాజెక్ట్‌లకు డబ్బింగ్ చెప్పేది. అయినప్పటికీ, ఆమె బిజీగా ఉండటం, తనకు నచ్చినది చేయడం ఇష్టపడుతుంది. షూట్ తర్వాత, ముందు ఆమె తన కుటుంబంతో వీలైనంత ఎక్కువ సమయం గడపడానికి ప్రయత్నిస్తుంది.