బిగ్ బాస్ హౌస్ లో 3 వారాల‌కు దామిని ఎంత సంపాదించిందో తెలుసా?

త‌న మ‌ధుర గాత్రంతో ఎంతో మంది అభిమానుల‌ను సంసాదించుకున్న సింగర్ దామిని గురించి కొత్త‌గా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. రాజమౌళి తెర‌కెక్కించిన బాహుబలి ది బిగినింగ్ సినిమాలో `పచ్చ బొట్టేసిన` పాటతో తెలుగు దామినికి విపరీతమైన క్రేజ్ వ‌చ్చింది. ఆ త‌ర్వాత అనేక అద్భుత‌మైన పాట‌ల‌తో అల‌రించింది. ఇటీవ‌ల కొండపొలం సినిమాలోని `ధం ధం` పాటకు నేష‌న‌ల్ అవార్డు కూడా అందుకున్న దామిని.. ఎన్నో ఆశ‌ల‌తో తెలుగు బిగ్ బాస్ సీజ‌న్ 7లో అడుగు పెట్టింది.

హౌస్ లో అడుగు పెట్టిన ద‌గ్గ‌ర నుంచి త‌న‌దైన ఆట‌తీరుతో ముందుకు సాగింది. బ‌య‌ట చాలా ప‌ద్ధ‌తిగా క‌నిపించినా.. బిగ్ బాస్ హౌస్ లో మాత్రం ఎక్స్‌పోజింగ్ చేస్తూ ప్రేక్ష‌కుల‌ను ఆశ్చ‌ర్య‌ప‌రిచింది. బాగా కుక్కింగ్ చేస్తూ వంట‌ల‌క్క‌గా పేరు తెచ్చుకుంది. కానీ, ఎక్కువ రోజులు బిగ్ బాస్ హౌస్ లో ఉండ‌లేక‌పోయింది. మూడో వార‌మే ఈ అమ్మ‌డు ఇంటి బాట ప‌ట్టింది.

గౌతమ్ కృష్ణ, ప్రిన్స్ యావర్, శుభ శ్రీ రాయగురు, రతిక రోజ్, సింగర్ దామిని, అమర్ దీప్ చౌదరి, ప్రియాంక జైన్ మొత్తం ఏడుగురు నామినేషన్స్ లో ఉండ‌గా.. చివ‌ర‌కు దామిని ఎలిమినేట్ అయింది. అయితే బిగ్ బాస్ హౌస్ లో 3 వారాల‌కు దామిని ఎంత సంపాదించింది అన్న‌ది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. వారానికి రూ. 2 ల‌క్ష‌లు చొప్పున దామినితో బిగ్ బాస్ మేక‌ర్స్ ముందే డీల్ మాట్లాడుకున్నాడు. దీంతో మూడు వారాలు ఉన్నందుకు గానూ దామినికి వారు రూ. 6 ల‌క్ష‌లు ముట్ట‌చెప్పార‌ని టాక్ న‌డుస్తోంది.