7/G బృందావన్ కాలనీ సినిమాలో కాజల్ అగర్వాల్…. ఏ సీన్ లో ఉందో తెలుసా….!!

తెలుగు సినీ చరిత్రలో ఎన్నో ప్రేమ కథల సినిమాలు వచ్చాయి. వాటిలో 7/G బృందావన్ కాలనీ మూవీ చాలా ప్రత్యేకం. ఈ సినిమాలో రవికృష్ణ, సోనియా అగర్వాల్ జంటగా నటించారు. ఈ సినిమాకి సెల్వ రాఘవన్ దర్శకత్వం వహించారు. ఈ మూవీ కోలీవుడ్ కంటే తెలుగులో రెస్పాన్స్ బాగా వచ్చింది. ఈ సినిమా వచ్చి ఇప్పటికీ 19 ఏళ్లు గడిచిన టీవీల్లో వస్తుందంటే చాలు సినీ లవర్స్ స్క్రీన్ కు అతుక్కుపోతారు.

అలాంటి మూవీ శుక్రవారం రోజు రి రిలీజ్ అయింది. ఇక మొదటి రోజే ఈ సినిమా ఏకంగా రూ. కోటికి పైగా కలెక్షన్స్ వసూలు చేసింది. ఈ సినిమాలో మేం వయసుకు వచ్చాం పాట ఎంతో ఫేమసో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.

అయితే ఈ పాటలో టాలీవుడ్ స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ జూనియర్ ఆర్టిస్టుగా డాన్స్ చూసిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ పాట చేసిన తర్వాత కొందరు నెటిజెన్స్… సినిమాల్లోకి రాకముందు కాజల్ సైడ్ డాన్సర్ గా చేసిందంటూ కామెంట్ చేస్తున్నారు.