జైలర్ మూవీలో నటించిన ఈ బుడ్డోడు బ్యాగ్రౌండ్ తెలిస్తే షాక్ అవుతారు..

కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ రజినీకాంత్ ఇటీవల జైలర్ సినిమాతో భారీ బ్లాక్‌బస్టర్ ఖాతాలో వేసుకున్న సంగతి తెలిసిందే. డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్ రూపొందించిన ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్ లో బీభత్సం సృష్టించింది. ఇక ఈ సినిమా అన్ని భాషల్లోనూ ఘనవిజయాన్ని అందుకుంది. ఈ సినిమా మంచి సక్సెస్ అందుకోవడంతో నిర్మాత కళానిధి మారన్ సినీ బృందానికి పెద్ద ఎత్తున కానుకలు అందజేసిన సంగతి అందరికీ తెలుసు.

ఇక ఈ సినిమాలో రజనీకాంత్ మనవడుగా నటించిన చైల్డ్ ఆర్టిస్ట్ ఎవరు అని ఆరా తీస్తే ఈ బాబుకు సంబంధించి కొన్ని ఆసక్తికర విషయాలు బయటకు వచ్చాయి. ఈ బాబు ఇదివరకే కార్తి హీరోగా నటించిన సర్దార్ సినిమాలో నటించాడు. ఇక సినిమాల్లోకి రాకముందు ఈ చిన్నారి తనకంటూ ఒక యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసుకున్నాడు. ఇతనికి రీతు రాక్స్ అనే యూట్యూబ్ ఛానల్ ఉంది. ఏకంగా 24 లక్షల మంది ఫ్యాన్ ఫాలోవర్స్ సంపాదించుకున్న ఈ బుడ్డోడు యూట్యూబ్ ఛానల్ ద్వారా సరికొత్త కాన్సెప్ట్ అన్నింటినీ షేర్ చేస్తూ మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించి ఎంతో సక్సెస్ అందుకున్నాడు.

ఈ చిన్నారికి చైల్డ్ ఆర్టిస్ట్ గా సినిమా అవకాశాలు కూడా క్యూ కడుతున్నాయి. ఇక ఈ సినిమాలో నటించినటువంటి ఈ బుడ్డోడు డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కు ద‌గ్గ‌ర బంధువేనట. నెల్సన్ కజిన్ కుమారుడే అనే విషయాన్ని డైరెక్టర్ సినిమా ఈవెంట్లో తెలియజేశాడు. ఏదేమైనా ఇంత చిన్న వయసులో తన నటనతో అందరిని మెప్పించిన ఈ బుడ్డోడు పెదైన‌ తర్వాత హీరోగో కూడా ఓ రేంజ్‌లో సక్సెస్ అందుకుంటాడంటూ సినీ ప్రముఖులు ప్రశంసలు కురిపిస్తున్నారు.