షూటింగ్ అవ్వ‌క‌ముందే ఓటీటీ డీల్ క్లోజ్ చేసుకున్న `పుష్ప 2`.. రికార్డు ధ‌ర ప‌లికిన‌ డిజిట‌ల్ రైట్స్‌!

అల్లు అర్జున్ కెరీర్ లో `పుష్ప‌`కు చాలా ప్ర‌త్యేక‌మైన స్థానం ఉంది. ఆయ‌న చేసిన తొలి పాన్ ఇండియా సినిమా ఇది. సుకుమార్ ద‌ర్శ‌క‌త్వ బాధ్య‌త‌లు తీసుకోగా.. మైత్రీ మూవీ మేక‌ర్స్ బ్యాన‌ర్ పై హై బ‌డ్జెట్ తో నిర్మిత‌మవుతోంది. ఈ సినిమా రెండు భాగాలుగా రాబోతోంద‌ని ముందే ప్ర‌క‌టించారు. ఫ‌స్ట్ పార్ట్ ను `పుష్ప ది రైజ్‌` టైటిల్ తో 2021లో విడుద‌ల చేశారు. ఈ మూవీ సృష్టించిన సెన్సేష‌న్ ఎలాంటిదో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు.

పాన్ ఇండియా స్థాయిలో అల్లు అర్జున్ స్టార్ అయిపోయాడు. అలాగే ఉత్త‌మ న‌టుడిగా జాతీయ అవార్డును సైతం ద‌క్కించుకున్నాడు. ప్ర‌స్తుతం `పుష్ప 2` రెడీ అవుతోంది. తొలి భాగాన్ని మించి ఉండేలా సుకుమార్ సెకండ్ పార్ట్ ను తీర్చిదిద్దుతున్నాడు. అయితే తాజాగా ఈ మూవీకి సంబంధించి ఓ క్రేజీ న్యూస్ నెట్టింట వైర‌ల్ గా మారింది. అదేంటంటే.. షూటింగ్ పూర్తి అవ్వ‌క‌ముందే పుష్ప 2 ఓటీటీ డీల్ క్లోజ్ అయింద‌ట‌.

పుష్ప 2: ది రూల్ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్ర‌ముఖ ఓటీటీ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ నెట్‍ఫ్లిక్స్ సొంతం చేసుకుంద‌ట‌. ఈ సినిమా డిజిట‌ల్ రైట్స్ రికార్డు ధ‌ర ప‌లికిన‌ట్లు తెలుస్తోంది. అన్ని భాష‌ల‌కు చెందిన హ‌క్కుల కోసం నెట్‌ఫ్లిక్స్ రూ. 350 కోట్లుకు పైగా వెచ్చింద‌ని అంటున్నారు. దీంతో ఇప్పుడీ మ్యాట‌ర్ నెట్టింట హాట్ టాపిక్ గా మారింది. కాగా, పుష్ప 2 మూవీ షూటింగ్ ప్రస్తుతం జోరుగా సాగుతోంది. భారీ యాక్షన్ సీక్వెన్సులు ఈ మూవీలో అల‌రించ‌బోతున్నాయి.