గ్యాంగ్‌స్ట‌ర్‌గా మ‌హేష్‌బాబు విశ్వ‌రూపం… ఆ క్రేజీ డైరెక్ట‌ర్‌తో సినిమా ఫిక్స్‌..!

టాలీవుడ్ లో విజయ్ దేవరకొండ నటించిన అర్జున్ రెడ్డి ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ హీట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సినిమాకు దర్శకత్వం వహించిన సందీప్ వంగ టాలెంట్ ఈ సినిమాతోనే ప్రూవ్ అయింది. డైరెక్టర్‌గా త్రూ ఔట్ ఇండియా మంచి పేరు సంపాదించుకున్న సందీప్ వంగా తాజాగా తన ఫ్యూచర్ ప్రాజెక్టుపై అనుకోకుండా ఇచ్చారు. అందరిని సర్ప్రైజ్ చేస్తూ తన సూపర్ స్టార్ మహేష్ సినిమాకు డైరెక్టర్ గా చేయబోతున్నట్లు వివరించాడు.

తన మాటలతో ఆ సినిమా గురించి ఇచ్చిన హింట్‌ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఇక ప్రజెంట్ ప్ర‌జెంట్ మ‌హేష్ గుంటూరు కారం సినిమా షూటింగ్లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా తర్వాత మహేష్ బాబు పాన్ ఇండియా స్టార్ట్ డైరెక్టర్ రాజమౌళి డైరెక్షన్లో మరో సినిమా చేయబోతున్నారు. భారీ రేంజ్ లో ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాను రూపొందించబోతున్నాడు రాజమౌళి. ఈ సినిమా తర్వాత సందీప్ వంగ డైరెక్షన్లో గ్యాంగ్ స్టర్‌గా మహేష్ బాబు చేయనున్నాడట.

ఇదే విషయాన్ని తాజాగా జరిగిన ప్రెస్ మీట్ లో రిపోర్టర్ అడిగిన ప్రశ్నకు సమాధానంగా సందీప్ చెప్పాడు. సందీప్ వంగా మహేష్ కోసం నెగిటివ్ స్టేట్‌లో ఉండే ఓ క‌థ‌ను రెడీ చేశానని అండర్ వరల్డ్ డాన్‌గా ఆ సినిమాలో మహేష్ కనిపించబోతున్నాడని మహేష్ బాబు కూడా ఈ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా చెప్పాడు. ప్రస్తుతం ఈ న్యూస్‌ సోషల్ మీడియాలో వైరల్ అవడంతో మహేష్ బాబు ఫ్యాన్స్ మా అభిమాన హీరో నుంచి కూడా ఓ సినిమా రాబోతుందన్న ఆనందంలో పండగ చేసుకుంటున్నారు.