పూజ హెగ్డే కి… మరోసారి ఛాన్స్ ఇవ‌డానికి రెడీ అయిన మాట‌ల‌మాంత్రికుడు..!!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, త్రివిక్రమ్ శ్రీనివాస్ తో ఆల్రెడీ తన కొత్త ప్రాజెక్టును అధికారికంగా ప్రకటించిన సంగతి మనందరికీ తెలిసిందే. ఈ సినిమా 2024 ఏప్రిల్ నుంచి స్టార్ట్ అవుతుందని… ఇక 2025వ సంవత్సరం సంక్రాంతి సందర్భంగా రిలీజ్ అవుతుందని ఇప్పటికే వార్తలు వచ్చాయి. అయితే.. తాజాగా ఈ సినిమాలోని హీరోయిన్ పై ఓ ఇంట్రెస్టింగ్ రూమర్ వినిపిస్తుంది.

అలా వైకుంఠపురములో కాంబినేషన్ మళ్లీ రిపీట్ కాబోతుంది. పూజా హెగ్డే ని ఈ సినిమాలో హీరోయిన్ గా తీసుకోబోతున్నారట. మహేష్ బాబు గుంటూరు కారం సినిమాలో మొదట పూజా హెగ్డే ని త్రివిక్రమ్ హీరోయిన్ గా తీసుకున్నారు. కానీ ఆ తర్వాత ఆమె ఆ సినిమా నుంచి తప్పుకుంది. ఈ నేపథ్యంలో పూజ హెగ్డేకి త్రివిక్రమ్ మళ్ళీ చాన్స్ ఇస్తున్నారని టాక్‌ నడుస్తుంది.

 

ఇక జులాయి, సన్ ఆఫ్ సత్యమూర్తి, మరియు అల వైకుంఠపురములో వంటి సూపర్ హిట్ల తరువాత, అల్లు అర్జున్, త్రివిక్రమ్ మరోసారి జత కట్టినట్టు అయ్యింది. హారిక, హాసిని క్రియేషన్స్ మరియు గీతా ఆర్ట్స్ కలిసి ఈ భారీ సినిమాని నిర్మించనున్నారు. ఈ సినిమాకి సంగీత దర్శకుడు థమన్ సంగీతం సమకూర్చనున్నాడు. ప్రస్తుతం బన్నీ పుష్ప 2 సినిమాలో బిజీగా ఉన్నాడు.