వారంతా నన్ను వాడుకున్నారంటూ షాకింగ్ కామెంట్స్ చేసిన పూనమ్ కౌర్..!!

గతంలో హీరోయిన్ గా మంచి పాపులారిటీ సంపాదించింది హీరోయిన్ పూనమ్ కౌర్.. ఈ అమ్మడు అచ్చ తెలుగు అమ్మాయిక మంచి పాపులారిటీ సంపాదించుకుంది. కానీ పెద్దగా హీరోయిన్గా సక్సెస్ కాలేకపోవడంతో అవకాశాలు పెద్దగా రాలేదు. కానీ తరచూ నిరంతరం ఏదో ఒక వార్తలలో నిలుస్తూనే ఉంటుంది ఈ ముద్దుగుమ్మ. ఎప్పటికప్పుడు పరోక్షంగా పూనమ్ కౌర్,పవన్ కళ్యాణ్ ని ఉద్దేశిస్తూ ఇన్ డైరెక్ట్ గా ట్విట్ చేస్తూ ఉంటుంది.

పూనమ్ కౌర్ ప్రస్తుతం సామాజిక కార్యకర్తగా కొనసాగుతోంది. చేనేత కార్మికుల కోసం తన వంతు సహాయంగా దేశవ్యాప్తంగా పర్యటనలు చేస్తూనే ఉన్నది. అప్పుడప్పుడు ప్రముఖ రాజకీయ నాయకులతో భేటీ అయి పలు రకాల విషయాలను తెలుపుతూ ఉంటుంది. గతంలో పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్, పూనమ్ కౌర్ మధ్య ఎన్నో రకాల రూమర్స్ కూడా వినిపించాయి. ఇప్పటివరకు ఈ విషయాల పైన స్పందించలేదు. ముఖ్యంగా సార్వత్రిక ఎన్నికల సమయంలో పూనమ్ కౌర్ మీద పలు రకాల విమర్శలు వినిపించాయి. పవన్ కళ్యాణ్ ఈమెను మోసం చేశారని వార్తలు కూడా ఎక్కువగా వినిపిస్తూ ఉంటాయి.

తాజాగా పూనమ్ కౌర్ ఒక నోట్ ని రాసుకొస్తూ ఇప్పటివరకు తను ఏ రాజకీయ పార్టీ కండువా కప్పుకోలేదని ఏ రాజకీయ పార్టీతో తనకు సంబంధం లేదని కేవలం కొంతమంది కావాలని వారి స్వప్రయోజనాల కోసం తనని ఒక పావుగా వాడుకున్నారు అంటూ తెలిపింది. గత ఎన్నికలలో కూడా ఇలానే విస్తృత చేష్టలు చేశారు.. తద్వారా పైశాచిక ఆనందం కూడా పొందారు.. ఒక మహిళపై ఇలాంటి కుట్రలు చేయడం తగదు కాదు అంటూ దీంతో తనకు తన కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి చాలామంది అసభ్యకరంగా మాట్లాడుతున్నారని తెలిపింది.

అంతేకాకుండా తాను సిక్కుబిడ్డనని పోరాటాలు చేయడం మాత్రమే తెలుసు దయచేసి మీ రాజకీయాల కోసం తనని లాగొద్దు అంటూ తెలుపుతూ నేను చేనేత కార్మికుల కోసం మాత్రమే శ్రమిస్తున్నానంటూ తెలుపుతోంది.