నాగచైతన్య నన్ను కుక్కలాగా చీకొట్టాడు…. సమంత షాకింగ్ కామెంట్స్….!!

ఒకప్పుడు టాలీవుడ్ క్యూట్ కపుల్స్ గా సమంత, నాగచైతన్య ఫుల్ క్రేజ్‌ తెచ్చుకున్నారు. ప్రేమించి పెళ్లి చేసుకుని అందరి దృష్టిని ఆకర్షించారు. చిన్న చిన్న మనస్పార్ధాలు కారణంగా విడాకులు తీసుకుని విడిపోయారు. అప్పటి నుంచి వీరిద్దరికీ సంబంధించిన ఏదో ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంది. తాజాగా సమంత అప్పట్లో నాగచైతన్య గురించి చేసిన కొన్ని కామెంట్స్ మరోసారి నెట్టింట వైరల్ గా మారాయి.

సమంత గతంలో రానా హోస్ట్ గా చేసిన షోకి వెళ్లి నాగచైతన్య గురించి షాకింగ్ విషయాలు బయట పెట్టింది. సామ్ ను రానా మీకు కుక్కలు అంటే చాలా ఇష్టమా అని అడగగా దానికి సమంత స్పందించింది. ” నాకు కుక్కలంటే చాలా ఇష్టం. అందుకే నేను ఇంట్లో కుక్కని బాగా పెంచుకునే దాన్ని. కానీ పెళ్లయ్యాక మా ఆయనకు మాత్రం కుక్కలు అసలు ఇష్టం ఉండదు.

అందుకే ప్రస్తుతం కుక్కలను పెంచుకోవడం లేదు. ఇంట్లో కుక్క లేకపోయినా నేను చైతుకి కుక్కలాగే… ఎందుకంటే చైతు బ‌య‌ట‌కు వెళ్లి రావ‌డం ఆల‌స్యం నేనే ముందుగా వెళ్లి కుక్కలాగా పలకరిస్తాను. అందుకే చైతుకి కుక్కల అవసరం లేదు. నన్నే కుక్కలాగా పెంచుకుంటాడు. సమంత అప్పట్లో ఫన్నీగా మాట్లాడిన మాటలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. దీంతో సామ్ ఫ్యాన్స్ ఆమెను కుక్క కంటే అసహ్యంగా చూశాడు పాపం అందుకే విడాకులు తీసుకుంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు.