దుమ్ము దులిపేస్తున్న స్కంద ట్రైలర్-2 హిట్ పక్క..!!

హీరో రామ్ పోతినేని, డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్లో వస్తున్న మొదటి పాన్ ఇండియా చిత్రం స్కంద. ఈ సినిమాలో హీరోయిన్గా శ్రీ లీల నటిస్తోంది. ఇప్పటివరకు ఈ సినిమా నుంచి విడుదలైన పాటలు, టీజర్ ,ట్రైలర్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. బోయపాటి మార్కు మరొకసారి ఈ సినిమాలో చూపించారని చెప్పవచ్చు. తాజాగా ఈ సినిమాకు సంబంధించి మరొక ట్రైలర్ ని చిత్ర బృందం నిన్నటి రోజున థియేటర్లో విడుదల చేసినట్లుగా తెలుస్తోంది. ట్రైలర్ చాలా మాస్ యాక్షన్ తో డైలాగులతో అందరిని ఆకట్టుకునే విధంగా కనిపిస్తోంది.

Ram Pothineni and Sreeleela's 'Skanda' pre-release event set for August 26  | Telugu Movie News - Times of India

మరొకసారి హీరో రామ్ ఈ సినిమాలో ఎనర్జిటిక్ లెవెల్స్ మరింత హైప్ పెంచేశారని చెప్పవచ్చు. ఈ సినిమా ట్రైలర్ చూసిన అభిమానుల సైతం ఈ సినిమా ఖచ్చితంగా హిట్ అవుతుందని నమ్మకంతో ఉన్నారు. స్కంద సినిమా పూర్తిగా మాస్ యాక్షన్ సినిమాగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇందులో రొమాన్స్ ఫన్ ప్రతీది కూడా అందరిని ఆకట్టుకునే విధంగా కనిపిస్తున్నాయి. అఖండ తరహాలోని ఈ సినిమా ట్రైలర్ ఉన్నట్లుగా ఈ సెకండ్ ట్రైలర్లో కనిపిస్తోంది.

ముఖ్యంగా ఇందులో రాజకీయ అంశాలు కూడా ఆకట్టుకున్నట్లు ఉన్నాయి ..ముఖ్యమంత్రికి కాబోయే అల్లుడుగా రామ్ ఇందులో పరిచయం కాబోతున్నారు. రామ్ పూర్తిగా మాస్క్ లో రఫ్ గా కనిపిస్తూ చెప్పే డైలాగులు కూడా అందరిని కట్టుకునేలా ఉన్నాయి. రామ్ లోని మరొక యాక్షన్ కోణాన్ని ఇందులో చూపించినట్లుగా తెలుస్తోంది.ట్రైలర్ అద్వంతం రామ్ యాక్షన్ తో అతని డైలాగులతో పవర్ ఫుల్ గా ఈ ట్రైలర్ ఉందని చెప్పవచ్చు. అద్భుతమైన బ్యాగ్రౌండ్ స్కోర్ తో కూడా ఈ సినిమా హైయెప్ ని పెంచేస్తున్నారు. ఈ సినిమా ఈనెల 28న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.