ఆ పని చేయడం వల్ల హర్ట్ అవుతున్న ప్రభాస్ ఫ్యాన్స్..!!

పాన్ ఇండియా హీరో ప్రభాస్ ప్రస్తుతం పాన్ ఇండియా రేంజ్ లో మార్కెట్ పెంచుకోవడంతో పాటు వరుసగా తన సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్నారు. సలార్ సినిమాని పోస్ట్ ఫోన్ చేయడంతో అభిమానుల సైతం చాలా నిరుత్సాహంతో ఉన్నారు అయితే తాజాగా మైసూరులో ఉన్న ప్రభాస్ మైనపు విగ్రహానికి సంబంధించి పలు రకాల ఫోటోలు సైతం వైరల్ గా మారుతున్నాయి అయితే ఈ ఫోటోలను చూసిన ప్రబాస్ అభిమానులు చాలా అసంతృప్తికి గురవుతున్నట్లుగా తెలుస్తోంది.

ముఖ్యంగా ప్రభాస్ మైనపు విగ్రహం చాలా దారుణంగా ఉందంటూ పలువురు నెటిజెన్స్ సైతం తెలుపుతూ ఉన్నారు. ప్రభాస్ మైనపు విగ్రహం అసలు అతని పోలికలతో లేకపోవడంతో ఇంత నిర్లక్ష్యంగా ఎందుకు వ్యవహరిస్తున్నారంటూ మరియు కొంతమంది నేటిజన్లు సోషల్ మీడియా వేదికగా కామెంట్స్ చేస్తున్నారు. బాహుబలి చిత్రంలోని గెటప్ లో ఈ విగ్రహాన్ని తయారు చేసినట్టుగా తెలుస్తోంది. కానీ ఫేసులో అలా కనిపించడం లేదు.. ప్రభాస్ తన సినిమాల ప్రమోషన్ విషయంలో ప్రభాస్ ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టాల్సి ఉందని లేకపోతే ప్రభాస్ కెరియర్ ప్రమాదంలో పడే అవకాశం ఉందని పలువురు అభిమానులు సైతం వాపోతున్నారు. ప్రభాస్ సినిమాల పరంగా బిజినెస్ భారీగానే జరుగుతున్న నేపథ్యంలో సరైన కథలు ఎంపిక చేసుకోవడంలో విఫలమవుతున్నారు.

ప్రభాస్ ఒక్కో చిత్రానికి 120 కోట్ల రూపాయలకు పైగా రెమ్యూనరేషన్ తీసుకుంటున్నప్పటికీ ప్రస్తుత పరిస్థితులలో సరైన సక్సెస్ కోసం చాలా ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. ప్రభాస్ ఫ్యాన్ ఫాలోయింగ్ మాత్రం రోజురోజుకి పెరుగుతూనే ఉన్నది. మరి ఏడాదైనా సలార్ సినిమా మొదటి భాగాన్ని విడుదల చేసి అభిమానులను ఆనందపరుస్తారేమో చూడాలి మరి.