నాగార్జుననే భయపెట్టించిన ఏకైక హీరోయిన్ ఎవరో తెలుసా..?

బాలనటిగా మొదట తన సినీ కెరియర్ను ప్రారంభించి ఆ తర్వాత హీరోయిన్గా ఎన్నో చిత్రాలలో నటించి మంచి పాపులారిటీ అందుకుంది హీరోయిన్ శ్రీదేవి.. టాలీవుడ్ స్టార్ స్టేటస్ ను సంపాదించుకున్న తర్వాత బాలీవుడ్లోకి వెళ్లి అక్కడ తన సత్తా చాటింది.. తెలుగులో ఎంత పేరు సంపాదించిందో బాలీవుడ్లో అంతకు పదిరెట్లు పేర్లు సంపాదించింది శ్రీదేవి.. ముఖ్యంగా ఈమె అందం అందరిని ఆకట్టుకునే విధంగా ఉండడంతో మంచి పాపులారిటీ అందుకుంది. అలా టాలీవుడ్ బాలీవుడ్ లో ఎంతో మంది స్టార్ హీరోల సరసన నటించిన శ్రీదేవి అబ్బాయిల కలల రాకుమారిగా ఉండేది.

Nagarjuna on Sridevi: I will miss her for as long as I work | Telugu News -  The Indian Express

అయితే శ్రీదేవి చనిపోయే ముందు ఎంత గ్లామర్ గా ఉండేదంటే ఆమె తరంలో ఉన్న హీరోలకు ఆమె పక్కన ఒక సినిమాలో నటించే అవకాశం వస్తే బాగుండని అనుకునే అంతగా పేరు సంపాదించింది శ్రీదేవి. కేవలం బాలకృష్ణతో తప్ప దాదాపుగా అందరి హీరోలతో నటించిన శ్రీదేవి. ఒక స్టార్ హీరో మాత్రం ఈమెతో కలిసి నటించడానికి చాలా భయపడేవారట. ఆయన ఎవరో కాదు అక్కినేని నాగార్జున 1988లో వీరిద్దరి కాంబినేషన్లో ఆఖరిపోరాటం అనే సినిమా రావడం జరిగింది.

Sridevi: Nagarjuna and Sridevi in Aakhari Poratam (1988)

ఈ చిత్రం అప్పట్లో మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమా శ్రీదేవి పక్కన నటించడానికి నాగార్జున చాలా భయపడిపోయాడట ఎందుకంటే ఆయన అప్పుడే ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్త హీరో శ్రీదేవి తో నాగార్జున తండ్రి ANR తో పలు సినిమాలలో నటించింది. అంత పెద్ద హీరోయిన్ సినిమా అంటే ఈమె నటనముందు నాగార్జున నటన నిలువలేదేమోనని భయంతో ఉండేవాడట. కానీ ఆమెతో రెండవ సినిమా చేసేటప్పుడు మాత్రం ఆ భయం లేదని తెలియజేశారు నాగార్జున. వీరి కాంబినేషన్లో నాలుగు సినిమాలు విడుదలయ్యాయి. అందులో రెండు హిందీ సినిమాలు తెలుగులో రెండు సినిమాలు విడుదలయ్యాయి.