జామ పండు ఆకుల వల్ల ఎన్ని ఉపయోగాలో తెలుసా..?

జామ పండు అనేది మనకి ఎక్కడైనా మార్కెట్లో సులువుగా లభించే అతి తక్కువ ధర పండు అని చెప్పవచ్చు. ఇది ఆరోగ్యానికి ఎన్నో రకాలుగా ఉపయోగపడుతుంది. జామ ఆకులు కాయలు కూడా శరీరానికి చాలా దివ్య ఔషధంగా పనిచేస్తాయి.


ఉదయాన్నే ఖాళీ కడుపుతో మనం జామ ఆకులను నమలడం వల్ల జీర్ణక్రియ చాలా సులువుగా జరుగుతుంది. ఇలా జీర్ణక్రియ సరిగ్గా జరగడం వల్ల మలబద్ధకం గ్యాస్ వంటి సమస్యలను దూరం చేస్తాయి. అందుకోసమే ప్రతిరోజు న్యాతగా ఉన్న జామ ఆకులను నమలాలి.

అధిక బరువుతో ఇబ్బంది పడేవారు జామ ఆకులను నమిలి తినడం వల్ల బరువు సులువుగా తగ్గుతారు. ఇందులో ఉండే కార్బోహైడ్రేట్ శోషణం జరిగి బరువుని నియంత్రించేలా చేస్తాయట.

జామ ఆకులు కాయలు కొలెస్ట్రాల్ ను నియంత్రించడంలో చాలా ఉపయోగపడతాయి. మన శరీరంలో ఉండే చెడు కొలెస్ట్రాలను సైతం తగ్గించడానికి దివ్య ఔషధంలా ఉపయోగపడతాయి.

జామకాయలను తరచూ తింటూ ఉండడం వల్ల షుగర్ లెవెల్స్ ను పెరగనివ్వకుండా చేస్తాయి. ఉదయాన్నే కాలి కడుపుతో జామకాయలను తినడం చాలా మంచిదట.

జామ ఆకులలో ఫినాలిక్ అనే పదార్థం ఉండడం వల్ల ఇది రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచి మధుమేహాన్ని నివారిస్తుందట. అలాగే జామ ఆకులు తింటూ ఉండడం వల్ల బీపీ కూడా అదుపులోకి వస్తుంది. జామకాయల లాగే ఇందులో పొటాషియం ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉండటం వల్ల రక్తపోటును అదుపులో ఉంచుతుంది.

అందుకే ఉదయం లేచిన వెంటనే పడకడుపుతో జామ ఆకులను నమ్మడం వల్ల అనేక రకాల వ్యాధుల నుంచి మనం ఉపశమనం పొందవచ్చు.