ఈ కుర్రాడిని గుర్తుపట్టారా..? 23 సర్జరీలు తర్వాత కాళ్ళను తిరిగి రప్పించుకున్న స్టార్ హీరో..!?

ఈ ఫోటోలో ఉన్న కుర్రాడు ఇప్పుడు ఒక పెద్ద స్టార్ హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇంతకీ ఎవరో గుర్తుపట్టారా.. ఇతని తండ్రికి సినిమాలంటే పిచ్చి.. ఆ ఇంట్రెస్ట్ తోనే ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు కానీ ఊహించిన రేంజ్‌లో సక్సెస్ కాలేదు. దీంతో అతని కొడుకుని కూడా ఇండస్ట్రీ లోకి రప్పించాడు. నటనలో నేటి తరం కమలహాసన్ అనే ముద్ర వేసుకున్నాడు. ఎన్నో ఇండస్ట్రీ హిట్స్ కి కేరాఫ్‌గా నిలిచిన ఇతగాడు ప్రస్తుతం సౌత్ ఇండస్ట్రీలో బిగ్గెస్ట్ సూపర్ స్టార్స్ లో ఒకడు.

ఇక టాలీవుడ్ లో కూడా ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించాడు. వాస్తవానికి తెలుగు సినిమాతోనే ఇండస్ట్రీ లోకి అడుగు పెట్టాడు. కానీ ఆ తర్వాత తమిళ్ ఇండస్ట్రీలో నటించి అక్కడే సెట్టిల్ అయ్యాడు. స్టార్ హీరోగా పేరు సంపాదించుకున్నాడు. ఇప్పటికైనా ఎవరో గుర్తుపట్టారా.. అత‌డే చియాన్ విక్రమ్. ఈ ఫోటోలో క్యూట్ గా కనిపిస్తున్న ఆయన తండ్రి పేరు వినోద్ రాజ్. కొన్ని సినిమాల్లో నటించాడు. ఇక‌ తండ్రిని ఇన్స్పిరేషన్ గా తీసుకొని హీరో అవ్వాలని విక్రమ్ తెగ ప్రయత్నించేవాడు. దానిని గమనించిన వినోద్ రాజ్ చిన్నతనం నుంచే విక్రమ్‌ను బాగా ప్రోత్సహించాడు.

అలా ఫిల్మ్ ఇన్స్టిట్యూలో చేరిన విక్రమ్ ఒకరోజు ఆడిష‌న్స్ కోసం వెళ్తుండగా ఒక ట్రక్ అతని గుద్దేసింది. దీంతో విక్రమ్ రెండు కాళ్లు విరిగిపోయాయి. విరిగిన రెండు కాళ్లు తీస్తే గాని విక్రమ్ ప్రాణాలతో ఉండాలని డాక్టర్స్ తేల్చి చెప్పేసారట. కానీ విక్రమ్ మాత్రం తన హీరో అవ్వాలని అనుకున్న కలలు ఆవిరైపోతాయని భయపడ్డాడట. దయచేసి నా కాళ్లకు ఏదైనా ఆపరేషన్ చేయండి అంటూ బ్రతిమిలాడగా పెద్దపెద్ద సర్జన్స్‌ని పిలిపించి 23 సర్జరీలు చేయించిన తర్వాత తన కాళ్లు తిరిగి సెట్ అయ్యాయి. అలాంటి విక్రమ్‌ నేడు ఇండస్ట్రీలో అడుగుపెట్టి ఎన్నో సంచలనాత్మకమైన సినిమాల్లో నటించి ఇండస్ట్రీ హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకున్నాడు. సౌత్ లోనే టాప్ స్టార్ గా ఎదిగాడు.