గుంటూరు కారం సినిమా కోసం మహేష్ ఎన్ని కోట్లు తీసుకున్నారు తెలుసా..?

సూపర్ స్టార్ మహేష్ బాబు డైరెక్టర్ త్రివిక్రమ్ కాంబినేషన్లో రాబోతున్న చిత్రం గుంటూరు కారం. ఈ సినిమా మొదలు పెట్టినప్పటి నుంచి ఇప్పటివరకు అన్ని అడ్డంకులే ఏర్పడుతున్నాయి.. ముఖ్యంగా హీరోయిన్ల విషయంలో కూడా పలు రకాల ఇబ్బందులు ఏర్పడడమే కాకుండా.. ఎప్పటికప్పుడు గుంటూరు కారం సినిమా పైన పలు రూమర్లు వినిపిస్తూనే ఉంటాయి. ఈ సినిమా ఈ ఏడాది విడుదల కావాల్సి ఉండగా కొన్ని కారణాల చేత వాయిదా పడుతూనే వస్తోంది.. ఎలాగైనా సరే ఈ సినిమాని వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేసే విధంగా ప్లాన్ చేస్తున్నారు చిత్ర బృందం

Guntur Kaaram: Meenakshii Chaudhary Comes On-Board Mahesh Babu-Starrer, To Play Role Initially Offered To Sreeleela

మహేష్ బాబు ,త్రివిక్రమ్ కాంబినేషన్లో దాదాపుగా 12 ఏళ్ల తర్వాత మళ్లీ వీరిద్దరి కాంబినేషన్లో వస్తున్న సినిమా కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అయితే ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతున్నట్లు తెలుస్తోంది. మహేష్ కు జోడిగా శ్రీ లీల నటిస్తూ ఉండగా మరొక హీరోయిన్ మీనాక్షి చౌదరి కూడా నటిస్తున్నట్లు తెలుస్తోంది. సంగీతాన్ని థమన్ అందిస్తూ ఉన్నారు. ఈ చిత్రంలో మహేష్ బాబు మాస్ హీరోగా కనిపించబోతున్నట్లు ఇదివరకే విడుదలైన గ్లింప్స్ చూస్తే మనకి అర్థమవుతుంది.

ఇదంతా ఇలా ఉంటే ఈ చిత్రం కోసం మహేష్ బాబు రెమ్యూనరేషన్ తెలిసి అందరూ ఆశ్చర్యపోతున్నారు.. అయితే ఈ సినిమా కోసం దాదాపుగా 80 కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ తీసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.. మొత్తం ఈ సినిమా 200 కోట్లు బడ్జెట్ తో తెరకెక్కిస్తూ ఉన్నారు ఈ సినిమా పాన్ ఇండియా సినిమా కాకపోయినా ఈ రేంజ్ లో రెమ్యూనరేషన్ నిర్మాతలు ఇచ్చారంటే ఇక మహేష్ బాబు రేంజ్ ఏంటో చెప్పాల్సిన పనిలేదు..