కొరటాల శివతో విభేదాలు పై క్లారిటీ ఇచ్చిన బండ్ల గణేష్..!!

తెలుగు సినీ ఇండస్ట్రీలో మొదట కమెడియన్గా తన కెరీర్ను ప్రారంభించి ఆ తర్వాత నిర్మాతగా స్థానాన్ని సంపాదించుకున్న వారిలో బండ్ల గణేష్ కూడా ఒకరు.. చిన్నచిన్న వేషాలు వేసుకుని ఇతనికి పెద్ద సినిమాలను నిర్మించే డబ్బులు ఒక్కసారిగా ఎలా వచ్చిందో అంటూ అప్పట్లో ఎక్కువగా వార్తలు వినిపించాయి.. కానీ బండ్ల గణేష్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టకు ముందు నుంచే పెద్ద కోటీశ్వరుడు అని ఆయనకి హైదరాబాదులో పెద్ద కోళ్ల ఫామ్ కూడా ఉన్నట్లు ఒక ఇంటర్వ్యూలో తెలియజేశారు.

Ram Charan learns lesson with Koratala

ఆ కోళ్ల ఫారం నుంచి కోట్లల్లో ఆదాయం వస్తుందని అలా వచ్చిన డబ్బుతోనే నిర్మాతగా మారి పలు సినిమాలను తీసినట్లు తెలుస్తోంది. మొదట రవితేజ తో కలిసి ఆంజనేయులు అనే సినిమాని నిర్మించిన బండ్ల గణేష్ ఆ తర్వాత పవన్ కళ్యాణ్ తో తిన్ మార్ సినిమాని తెరకెక్కించారు. ఈ సినిమా రెండు ఫ్లాపులుగా మిగిలాయి. దీంతో నిర్మాతగా ఫెయిల్ అవుతానేమో అని డీలపడుతున్న సమయంలో బండ్ల గణేష్ కి ఒక్కసారిగా గబ్బర్ సింగ్ సినిమా బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకోవడంతో ఓవర్ నైట్ కి స్టార్ నిర్మాతగా పేరు సంపాదించారు.

ఇక తర్వాత బండ్ల గణేష్ నిర్మాతగా బాద్షా, నీ జతగా నేనుండాలి ఇద్దరమ్మాయిలతో గోవిందుడు అందరివాడే టెంపర్ వంటి చిత్రాలకు నిర్మాతగా నిర్మించారు.. ఇవన్నీ కూడా పరవాలేదు అనిపించుకున్నాయి.. ఇదంతా పక్కన పెడితే రామ్ చరణ్ కొరటాల శివ కాంబినేషన్లో గతంలో ఒక సినిమాని అనౌన్స్మెంట్ చేశారు. ఈ సినిమాకి నిర్మాతగా బండ్ల గణేష్ ఉన్నారు. అయితే ఈ సినిమా కథ విషయంలో పలు రకాల అనుమానాలు ఉండడంతో ఈ ప్రాజెక్టు నిలిచిపోయింది.. అయితే ఈ సినిమా ప్రారంభం కంటే ముందుగానే కొరటాల శివకు బండ్ల గణేష్ 25 లక్షల రూపాయలు అడ్వాన్స్ ఇచ్చినట్లుగా సమాచారం..కొరటా శివ ఈ డబ్బులు తిరిగి ఇవ్వకపోవడంతో పెద్ద గొడవ జరిగిందని గతంలో ఇండస్ట్రీలో వార్తలు వినిపించాయి.. కానీ ఈ విషయంపై బండ్ల గణేష్ మాట్లాడుతూ అడ్వాన్స్ తీసుకున్న వార్త నిజమే కానీ తనతో ఎలాంటి విభేదాలు లేవని క్లారిటీ ఇచ్చారు. రాబోయే రోజుల్లో కచ్చితంగా సినిమా చేస్తానంటూ చెప్పుకొచ్చారు బండ్ల గణేష్.