గౌతమ్ షార్ట్ విప్పించిన నాగార్జున.. నువ్వు కూడా స్టైరేడ్స్ తీసుకున్నావా..? అంటూ ఫైర్..

బిగ్ బాస్ సీజన్ 7 ఈ వీకెండ్ ఎపిసోడ్ పై ప్రేక్షకుల్లో కూడా ఆసక్తి పెరిగింది. ఒక్కొక్కరి గురించి చెబుతూ కింగ్ మీటర్లో వారి పర్ఫామెన్స్ తగ్గట్టుగా కలర్ ఇచ్చాడు. నాగార్జున ఈ సందర్భంగా కొందరిపై ఫైర్ అయ్యాడు. బిగ్ బాస్ సీజన్7 తెలుగు రోజు రోజుకు ఇంట్రెస్టింగ్ గా జరుగుతున్న సంగతి తెలిసిందే. వారం అంత జరిగిన పనులను రివ్యూ చేసుకొని నాగార్జున వాళ్లకు హెచ్చరిస్తూ ఉంటాడు. తాజాగా ప్రచారమైన ఎపిసోడ్లో కొందరికి గట్టిగానే క్లాస్ పీకాడు. సెకండ్ పవర్ ఆస్రా కోసం జరిగిన పోటీలో గౌతమ్ – ప్రిన్స్ మధ్య గొడవ జరిగింది. స్టెరాయిడ్ ఇంజక్షన్ అంటూ సైగలు చేశాడు గౌతం.

దానిపై ప్రిన్స్ చాలా హర్ట్ అయ్యాడు. బయటకు వెళ్లిపోతానని ఏడ్చాడు. బిగ్ బాస్ ప్రిన్స్‌ను కన్విన్స్ చేసి తిరిగి పంపించాడు. అయినా కూడా యావర్‌ మాత్రం బాధపడ్డాడు గౌతమ్ సారీ చెప్పాలని కోరాడు. ఇక వీకెండ్ ఎపిసోడ్లో ఈ విషయంపై నాగార్జున మాట్లాడుతూ ప్రిన్స్ ఆ వరకు కింగ్స్ మీటర్ లో గ్రీన్ ఇచ్చి మెచ్చుకున్నాడు. చాలా బాగా ఆడావు అని చెప్పుకొచ్చాడు. ఇదే టైం లో గౌతమ్ కృష్ణను లేపి ప్రిన్స్ స్టెరాయిడ్స్ తీసుకుని బాడీ పెంచిన విషయం నీకు తెలుసా..? అని ప్రశ్నించాడు. ఒక మనిషిని అలా ఎలా అంటావ్ అంటూ ఫైర్ అయ్యాడు.

నువ్వు అన్న మాటలు హౌస్ లో ఎవరికీ నచ్చలేదని.. నాకు కూడా నచ్చలేదు అంటూ చెప్పుకొచ్చాడు. నచ్చని వారు చేయి పైకి లేపాలని నాగ్ కోరగా అందరూ చేయి ఎత్తరు. ఏదో ఆవేశంలో అలా అన్నాను అని గౌతమ్ అన్నాడు. నీ షర్ట్ తీసి చూపించు అని నాగార్జున చెప్పక గౌతమ్ చొక్కా విప్పాడు. మరి నీకు కూడా బాడీ ఉంది కదా నువ్వు కూడా స్టెరాయిడ్స్‌ తీసుకుంటేనే వచ్చిందా అని ప్రశ్నించాడు నాగార్జున. నేనే ఓ డాక్టర్ స్టెరాయిడ్స్‌ తీసుకున్న విషయం నాకు తెలుసు అని మిగతా కంటిస్టెంట్లు అందరితో ఎలా చెప్పావు? నువ్వు ఎలా డిసైడ్ చేస్తావని క్వశ్చన్ చేశాడు.

యావ‌ర్‌ ఎడమ చేతి పై ఇంజక్షన్ తీసుకున్నట్లు మార్క్ ఉందని గౌతమ్ చెప్పగా.. అది హీట్ వలన ప్రోటీన్స్ ఎక్కువగా తీసుకుంటే కూడా అలా వస్తుందని వివరించాడు. నాగార్జున దీనిపై స్పందించిన యావ‌ర్‌ నేను ఎలాంటి టెస్ట్ కైనా రెడీ అంటాడు. దీంతో నాగార్జున నువ్వు చేసింది కరెక్ట్ కాదని యావర్‌కి సారీ చెప్పమని గౌతమ్ కు ఆదేశించాడు. దీంతో గౌతమ్ వెళ్లి యావ‌ర్‌కు సారీ చెప్పాడు. ఇద్దరు కౌగిలించుకున్నారు. ఇంకోసారి ఇలాంటి రిపీట్ చేయక అని వార్నింగ్ ఇచ్చాడు నాగార్జున.