బిగ్ బాస్ 7 హౌస్ కి నటి సురేఖ వాణి కూతురు.. వైల్డ్ కార్డ్ ఎంట్రీ కన్ఫామ్….!!

బుల్లితెరపై సందడి చేస్తున్న ” బిగ్ బాస్ ” షో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఈ షో ఇప్పటికే ఆరు సీజన్లు సక్సెస్ ఫుల్ గా పూర్తి చేసుకుంది. ఇటీవల సీజన్ 7 ప్రారంభమై రెండు వారాలు అవుతుంది. ఇక ఉల్టా పుల్టా అంటూ బిగ్ బాస్ షోను స్టార్ట్ చేశారు నాగార్జున.. అందుకు తగ్గట్టుగానే షోను ఆసక్తికరంగా నడిపిస్తున్నారు.

గతంలో ఎన్నడూ లేని విధంగా టాస్కులు పెడుతూ బిగ్ బాస్ జనాల్లో ఆసక్తిని పెంచుతున్నాడు. ఇందులో 14 కంటిస్టెంట్స్ ఎంట్రీ ఇవ్వగా మొదటి వారం కిరణ్ రాథోడ్ ఎలిమినేట్ అయ్యింది. ప్రస్తుతం 13 మంది మాత్రమే హౌస్ లో ఉన్నారు. తాజాగా.. ఈవారం డబుల్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఉంటుందని సమాచారం.

ప్రముఖ సీనియల్ హీరో అంబటి అర్జున్.. ఇక రెండో కంటెస్టెంట్ గా నటి సురేఖ వాణి కూతురు సుప్రిత ఎంపికైనట్లు సమాచారం. దీంతో ఈ అమ్మడు బిగ్ బాస్ లో అడుగుపెడితే ఎన్ని లవ్ ట్రాక్లు మొదలు పెడుతుందోనని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.