హార్ట్ టచింగ్ మూమెంట్.. అభిమాని చేసిన ప‌నికి హీరో రామ్ ఎమోష‌న‌ల్‌!

అభిమాని లేని హీరో ఉండ‌డు. ఒక్క‌సారి ఆ హీరో న‌చ్చాడు అంటే అభిమానులు దైవం కంటే ఎక్కువగా అత‌న్ని కొలుస్తారు. క‌ష్ట‌సుఖాల్లో మేమున్నామంటూ అండంగా నిలుస్తారు. చివ‌ర‌కు త‌మ అభిమాన హీరో కోసం ప్రాణాలు కోల్పోయిన వారు ఎంద‌రో ఉన్నారు. తాజాగా హీరో రామ్ పోతినేనికి ఓ హార్ట్ ట‌చింగ్ మూమెంట్ ఎదురైంది. రామ్ అభిమానుల్లో ఓ వ్య‌క్తి ఎవ‌రూ ఊహించ‌ని ప‌నితో అంద‌రినీ ఆశ్చ‌ర్యానికి గురి చేశాడు.

హ‌రిహ‌ర అనే వ్య‌క్తి రామ్ పోతినేనికి విరాభిమాని. అయితే ఇటీవ‌ల హ‌రిహ‌ర‌కు ఓ కుమారుడు జ‌న్మించాడు. తాజాగా ఆ బాబుకు నామ‌క‌ర‌ణం వేడుక జ‌రిగింది. అయితే హ‌రిహ‌ర రామ్ పై ఉన్న అభిమానంతో త‌న కుమారుడుకు `స్కంద‌` అంటూ నామ‌క‌ర‌ణం చేశాడు. ఈ విష‌యాన్ని ఫ్యాన్స్ అసిసోయేష‌న్ కి చెందిన సందీప్ సోష‌ల్ మీడియా ద్వారా పంచుకున్నాడు. స్కంద అనే రామ్ హీరోగా తెర‌కెక్కిన కొత్త సినిమా టైటిల్‌.

రామ్ పై ఉన్న అభిమానంతో ఆయ‌న సినిమా టైటిల్ నే హ‌రిహ‌ర త‌న కుమారుడిగా పేరుగా పెట్టుకున్నాడు. ఈ విషయం రామ్ కు తెలియ‌డంతో.. వెంట‌నే స్పందించాడు. `ఈ విషయం నా మనసుకు హత్తుకుంది. ఆ పిల్లాడికి స్కంద దేవుడి ఆశీర్వాదాలు ఎప్పుడూ ఉంటాయి. ఆ అభిమానికి, అతడి కుటుంబాన్ని దేవుడు చల్లగా చూడాలని కోరుకుంటున్నాను` అంటూ రామ్ ఎమోష‌న‌ల్ ట్వీట్ చేశాడు. దీంతో ఈ మ్యాట‌ర్ కాస్త నెట్టింట వైర‌ల్ గా మారింది. కాగా, స్కంద విష‌యానికి వ‌స్తే.. బోయ‌పాటి శ్రీ‌ను తెర‌కెక్కించిన మాస్ యాక్ష‌న్ ఎంట‌ర్టైన‌ర్ ఇది. శ్రీ‌లీల ఇందులో హీరోయిన్ గా న‌టించింది. సెప్టెంబ‌ర్ 28న ఈ మూవీ పాన్ ఇండియా స్థాయిలో విడుద‌ల కానుంది.