కూర్చున్నప్పుడు కాళ్లు ఊపుతున్నారా.. అయితే ఆ సమస్య ఉన్నట్టే..?

మనలో చాలామందికి ఏదైనా కుర్చీలో కానీ సోఫాలో కానీ కూర్చున్నప్పుడు కాళ్లు ఊపే అలవాటు చాలామందికి ఉంటుంది.. దీంతో కాళ్లు ఊపడం కూడా ఒక వ్యాధిగానే చెబుతున్నారు.. మీరు కూర్చున్న సమయంలో మన కాళ్లు మన ప్రమేయం లేకుండానే ఊగడం జరుగుతూ ఉంటుందట. ఎవరితో మాట్లాడుతున్న పుస్తకాలు చదువుతున్న కాళ్లు ఊపడం అంత మంచిది కాదని నిపుణులు తెలియజేస్తున్నారు. కూర్చున్నప్పుడు కాళ్లు ఊపుతూ ఉండడం చాలా ప్రమాదకరమట.

ఎక్కువగా ఇది ఒత్తిడికి ఆందోళనకు గురయ్యే వాళ్ళే కాలుఉపడం అలవాటుగా ఉంటుందని నిపుణులు ఒక పరిశోధనలో తెలియజేసినట్లు తెలుస్తోంది. హార్మోన్ల అసమ్మతుల్యత కూడా కాళ్లు ఊపడానికి కారణమట. నిద్రలేమి సమస్యతో బాధపడే వారు కూడా కాళ్లు ఊపుతూ ఉంటారు..ఈ అలవాటును మార్చుకోవడానికి కేవలం ఐరన్ టాబ్లెట్లు మాత్రమే సహాయపడతాయని వైద్యులు తెలుపుతున్నారు ఈ సమస్యను తగ్గించే ఐరన్ మాత్రలతో పాటుగా బీట్రూట్ అరటి పండ్లు తరచూ తినడం వల్ల వీటి నుంచి ఉపశమనం పొందవచ్చు.

ఎక్కువసేపు మొబైల్ చూడడం టీవీ చూడడం అలవాటుని దూరం చేసుకోవాలి.. కాళ్లు ఊపడం అనేది చాలా చెడ్డ అలవాటు మన ఇంటికి కూడా నష్టాన్ని కలిగిస్తుందని పండితులు కూడా తెలియజేస్తూ ఉంటారు. వాస్తవానికి కాలు కదులుతున్నప్పుడు ఆ వ్యక్తిలో డిపోమైస్ హార్మోన్ విడుదలవుతుందట దీని కారణంగానే ప్రతిసారి పాదాలను కదిలించాలని భావన అతనిలో కలుగుతోందని వైద్యులు తెలుపుతున్నారు. అయితే ఈ పరీక్షను కనుగొనడానికి కేవలం రక్త పరీక్ష మాత్రమే ఉన్నది. అయితే ఇది ఎక్కువగా గర్భిణీలు కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న రోగులలో ఎక్కువగా ఉంటుందట. అయితే ఈ వ్యాధి చికిత్సకు కేవలం ఐరన్ లోపం ఉంచకుండా చూసుకోవాలి.