రామ్మోహన్‌పై ధర్మాన బ్రదర్స్ డౌటే?

తెలుగుదేశం పార్టీ కంచుకోటల్లో శ్రీకాకుళం పార్లమెంట్ కూడా ఒకటి. ఇక్కడ మంచి విజయాలే సాధించింది. గత రెండు ఎన్నికల నుంచి ఇక్కడ టి‌డి‌పి నుంచి రామ్మోహన్ నాయుడు గెలుస్తూ వస్తున్నారు. ప్రజల పక్షాన పార్లమెంట్ లో బలమైన గళం వినిపిస్తారు కాబట్టే..ఈయనకు ప్రజా మద్దతు ఎక్కువ. ఇంకా రామ్మోహన్‌ని ఓడించడానికి వైసీపీ గట్టిగానే కష్టపడుతుంది.

అయితే ఇంతవరకు ఆయనపై సరైన ప్రత్యర్ధిని పెట్టలేదు. గత రెండు ఎన్నికల్లో అభ్యర్ధులని మార్చారు అయినా ప్రయోజనం లేదు. రామ్మోహన్‌కు చెక్ పెట్టలేకపోయారు. ఈ సారి కూడా మళ్ళీ కొత్త ప్రత్యర్ధిని బరిలో దించుతారని తెలుస్తోంది. కాకపోతే ఆ నేత ఎవరు అనేది క్లారిటీ లేదు. ఇప్పటికే కేంద్ర మాజీ మంత్రి కిల్లి కృపారాణి తెరపైకి వచ్చింది…కానీ ఆమె పోటీ చేసే అవకాశాలు తక్కువగానే ఉన్నాయని తెలుస్తోంది. దీంతో రామ్మోహన్ పై బలమైన ప్రత్యర్ధిని నిలబెట్టడానికే ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే శ్రీకాకుళంలో కీలకంగా ఉన్న ధర్మాన బ్రదర్స్ వారసుల్లో ఎవరోకరిని బరిలో దింపుతారని ప్రచారం నడుస్తోంది.

ధర్మాన ప్రసాద రావు వారసుడుని పోటీకి దింపే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. కానీ ధర్మాన బ్రదర్స్ మొదట నుంచి కింజరాపు ఫ్యామిలీతో పెద్దగా విభేదాలు లేవు. రాజకీయంగా వేరే వేరే పార్టీల్లో ఉన్న..వారు ఎప్పుడు ఒకరినొకరు టార్గెట్ చేసుకోలేదు. దీని బట్టి చూస్తే ధర్మాన వారసులు పోటీకి దిగడం కష్టమే అని తెలుస్తోంది.

కేవలం జగన్ పట్టుబడితే మాత్రం పోటీకి దిగడం తప్పదు..కానీ ఎవరు ప్రత్యర్ధిగా బరిలో దిగిన సిక్కోలులో రామ్మోహన్‌కు చెక్ పెట్టడం ఈజీ కాదనే తెలుస్తోంది.