ఆమె మోజులో స్టార్ హీరో.. అతడిని గుడ్డిగా ప్రేమించిన హీరోయిన్.. ప్రస్తుతం డిప్రెషన్లో నడవలేని స్థితిలో..!

చిత్ర పరిశ్రమలో చాలామంది హీరోయిన్లు వ‌య‌సు మీద పడుతున్న పెళ్లి అనే మాట తమ దగ్గరకు రానవిటం లేదు. వారి జీవితంలో జరిగిన చేదు అనుభవాల కారణంగాను.. భర్త అవసరం లేదని పెళ్లి అనే విషయాన్ని లైట్ తీసుకుంటున్నారు.. అలా 50 ఏళ్లు వచ్చినా పెళ్లి చేసుకోకుండా ఒంటరిగా మిగిలిపోతున్నారు. ఇదే సమయంలో ప్రేమ మైఖంలో పడిపోయే జీవితాన్ని నాశనం చేసుకున్న వాళ్లు కూడా ఉన్నారు. అలా నాశనం చేసుకున్న వారిలో సులక్షణ పండిత్ కూడా ఒకరు.. ఇప్ప‌టి తరం ప్రేక్షకులకు ఈమె ఎవరో తెలిసుండకపోవచ్చు కానీ 70 ,80 లో ఈమె గొప్ప హీరోయిన్.

సులక్షణ పండిత్ తన కెరీర్ లో జితేంద్ర, వినోద్ కన్నా, శత్రుఘ్న సిన్హ, రాజేష్ ఖన్నా, శశికపూర్ అమితాబ్‌ బచ్చన్‌ వంటి బాలీవుడ్ స్టార్ హీరోలతో కలిసి నటించింది. హీరోయిన్ గానే కాకుండా సింగర్ గా కూడా ప్రేక్షకులను మెప్పించింది. ఇంత మంచి మల్టీ టాలెంట్ ఉన్న ఈ హీరోయిన్ దురదృష్టవంతురాలనే పిలిచేవారు.. ఎందుకంటే ఈమె తన పాపులారిటీని మరింత పెంచుకునే ప్రయత్నాలు చేయలేదు కెరీర్‌పై అసలు ఫోకస్ చేయలేదు. అందుకు గల కారణం ప్రేమ.. అవును ఆమె హీరో సంజీవ్ కపూర్‌ను మనసారా ప్రేమించింది. అత‌డితోనే జీవితాన్ని బలంగా పంచుకోవాలని అనుకుంది. ఉల్జాన్‌ సినిమాలో వీరిద్దరూ కలిసి నటించారు. అప్పుడే సులక్షణ అతనిపై మనసు పారేసుకుంది.

అప్ప‌టికే సంజీవ్ కమార్ మరో హీరోయిన్ ను గాఢంగా ప్రేమిస్తున్నాడు.. ఆమె మరి ఎవరు కాదు హేమమాలిని అని అప్పట్లో ప్రచారం కూడా జరిగింది. ఆ హీరోయిన్ ని పెళ్లి చేసుకోవాలని ప్రయత్నించిన సంజీవ్ కమార్ ఆమె ఆ ప్రపోజల్ రిజెక్ట్ చేసింది. త‌న‌ ప్రేమను గెలుచుకోవాలని ఎంతో పట్టుదలతో అన్ని విధాలుగా ప్రయత్నించిన ఏటు నుంచి సానుకూల స్పందన రాకపోవడంతో సంజీవ్ కుమార్ పిచ్చివాడయ్యాడై, డిప్రెషన్ లోకి వెళ్లిపోయాడు. పెళ్లనేదే లేకుండా జీవితాంతం ఒంటరిగా ఉండాలని డిసైడ్ అయ్యాడు. ఈ నిర్ణయం సంజీవను ప్రేమించిన సులక్షణ పండిత్‌కు నిద్ర లేకుండా చేసింది.

ఎలాగైనా అతడిని ఒప్పించి తనతో జీవితాన్ని పంచుకోవాలనుకున్న కోరిక నెరవేరదని గ్రహించింది. తాను కూడా ఎవరిని పెళ్లి చేసుకోకుండా అతడి గురించే ఆలోచిస్తూ జీవితాన్ని గడిపేయాలని నిర్ణయించుకుంది. 1985లో 47 ఏళ్ల వయసులో సంజీవ్ కమార్ గుండెపోటుతో మరణించాడు. అతడు మనసులోనే భర్తగా ఊహించుకున్న సులక్షణ సంజీవ్‌ మరణాన్ని తట్టుకోలేక డిప్రెషన్ లోకి వెళ్లిపోయింది. ఇదే విషయాన్ని స్వయంగా సులక్షణ సోదరీ విజేత పండిత్ ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది తన సోదరి తన కళ్ళముందే జీవచ్ఛవంలా ప‌డీ ఉండటం చూసి తట్టుకోలేకపోయింది విజేత.

2006లో ఆమెను తన ఇంటికి తీసుకొచ్చింది. అయినా తన తీరు మారలేదు. ఎవరితోనూ మాట్లాడేది కాదు, ఎవరినీ కలిసేది కాదు. ఒంటరిగా తన గదిలోనే ఉండిపోయేది. ఆ నాలుగు గోడల మధ్యే తన జీవితం నలిగిపోయింది. ఒకరోజు బాత్రూమ్‌లో కాలు జారి పడిపోవడంతో తన తుంటి ఎముక విరిగింది. దాన్ని సరిచేయించుకునేందుకు నాలుగు సర్జరీలు చేసుకుంది.. కానీ ఫలితం లేకుండా పోయింది. ఇప్పటికీ తను ఎవరి సాయం లేకుండా లేచి నడవలేని పరిస్థితి! గుడ్డిగా ప్రేమించి, మనసులోనే ప్రియుడికి గుడి కట్టి, కళ్ల ముందే తన మరణాన్ని చూసి గుండె రాయి చేసుకుని బతికింది సులక్షణ! ప్రేమ మైకంలో పడి జీవితాన్నే నాశనం చేసుకుంది.