హీరోలుగా నటించి విలన్లుగా మారినాయి యంగ్ యాక్టర్స్ వీళ్లే..!

ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎప్పటికప్పుడు కొత్త విలన్స్ పుట్టుకొస్తూనే ఉన్నారు. ఇలా విలన్స్‌కు క్రేజ్ పెరిగిన నేపథ్యంలో కొంతమంది యంగ్ హీరోలు కూడా విలన్‌గా తమ సత్తా చాటుకుంటున్నారు. అందులో ఎవరెవరు ఉన్నారు ఒకసారి చూద్దాం. ఒకప్పుడు హీరోగా సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్న ప్రిన్స్.. ఇప్పుడు విలన్‌గా నటిస్తున్నాడు. బోయపాటి – రామ్ పోతినేని కాంబోలో వస్తున్న స్కంద సినిమాలో ప్రిన్ విల‌న్‌గా కనిపించబోతున్నాడు.

ఇప్పటికే ప్రిన్స్ పోషిస్తున్న ఆ విలన్ రోల్ గురించి ఇండస్ట్రీలో చర్చలు మొదలయ్యాయి. అయితే ప్రిన్స్ ఈ సినిమాలో విల‌న్‌గా మంచి గుర్తింపు తెచ్చుకుంటే అతను ఫ్యూచర్లో విలన్ గా మంచి అవ‌కాశాలు అందుకుంటాడు. ఇక బోయపాటి సినిమాలో విలన్ రోల్ అంటే ఎంత బలం ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక ఇతనితో పాటే హీరో నవీన్ చంద్ర కూడా విలన్ గా మారి తన సత్తాను చాటుకున్నాడు. ఎన్టీఆర్ హీరోగా త్రివిక్రమ్ డైరెక్షన్లో రూపొందిన అరవింద సమేత వీర రాఘవరెడ్డి సినిమాలో నవీన్ చంద్ర విలన్ గా నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్న.

ఈయన ప్రస్తుతం కొన్ని సినిమాల్లో హీరోగా ఒక పక్క విలన్ గా కూడా నటిస్తూ ప్రేక్షకులను ఆదరిస్తున్నాడు. ఇతని తరువాత ఆర్ఎక్స్ 100 సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన కార్తికేయ కూడా హీరోగా సక్సెస్ అయిన నాని హీరోగా వచ్చిన నానిస్ గ్యాంగ్ లీడర్ సినిమాలో విల‌న్‌ రోల్‌లో నటించాడు. ఆ పాత్రలో ఎంతో పవర్ఫుల్ గా కనిపించిన కార్తికేయ ఈ సినిమాతో మంచి సక్సెస్ సాధించడంతోపాటు ఏకంగా తమిళ్ స్టార్ హీరో అజిత్ హీరోగా నటించిన వలిమై సినిమాలో కూడా విలన్ గా నటించే అవకాశాన్ని దక్కించుకున్నాడు. ఈ సినిమాతో కూడా విలన్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు కార్తీకేయ‌.