ఇక్కడ చిన్ని..అక్కడ నాని..టీడీపీలో ఏం జరుగుతోంది?

తెలుగుదేశం పార్టీలో కేశినేని బ్రదర్స్ వ్యవహారం అంతు చిక్కకుండా ఉంది. ఇటు ఎంపీ కేశినేని నాని, అటు టి‌డి‌పి నేత కేశినేని చిన్ని సీటు కోసం పోటీ పడుతున్నారా? లేక వారిద్దరు టి‌డి‌పి శ్రేణులని కన్ఫ్యూజ్ చేస్తున్నారా? అనేది తెలియడం లేదు. విజయవాడ నుంచి రెండుసార్లు ఎంపీగా గెలిచిన నాని..అక్కడ ఉన్న టి‌డి‌పి లోకల్ లీడర్లతో విభేదాలు ఉన్న విషయం తెలిసిందే.

అందుకే లోకల్ గా పెద్దగా పార్టీ కార్యక్రమాల్లో ఆయన పాల్గొనడం లేదు. సొంతంగా కార్యక్రమాలు చేస్తున్నారు. అంతకముందు మహానాడుకు వెళ్లలేదు..మొన్న ఆ మధ్య విజయవాడలో లోకేశ్ పాదయాత్ర జరిగిన అందులో పాల్గొనలేదు. ఇక పాదయాత్రని విజయవంతంగా నడిపించే బాధ్యత కేశినేని చిన్ని తీసుకున్నారు. ఇక చిన్నికి టి‌డి‌పి నేతల సపోర్ట్ బాగానే ఉంది. అలాగే పాదయాత్రని సక్సెస్ చేశారు. పైగా ఈయన తన అన్న సీటు అడుగుతున్నారు. విజయవాడ ఎంపీ సీటు ఆశిస్తున్నారు. దీంతో నానిని పక్కన పెట్టి చిన్ని సీటు ఇస్తారనే ప్రచారం ఉంది. కానీ కేశినేని నాని పార్టీకి పూర్తిగా దూరంగా జరగడం లేదు.

నాని..చంద్రబాబుతో సఖ్యతగానే ఉంటున్నారు. ఆ మధ్య బాబు గవర్నర్‌ని కలిసిన నేపథ్యంలో నాని పక్కనే ఉన్నారు. తాజాగా ఓట్ల అక్రమాలపై బాబు..ఢిల్లీకి వెళ్ళి ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. ఆ సమయంలో బాబుతో పాటు ముగ్గురు ఎంపీలు ఉన్నారు. రామ్మోహన్ నాయుడు, గల్లా జయదేవ్, కేశినేని నాని ఉన్నారు.

అంటే కేశినేని నాని పూర్తిగా టి‌డి‌పికి దూరం కాలేదు. దీని బట్టి చూస్తే నాని అటు, చిన్ని ఇటు ఉన్నారు..మరి ఇద్దరిలో చంద్రబాబు ఎవరికి సీటు ఇస్తారనేది అర్ధం కాకుండా ఉంది.