వరుణ్, చైతులకు కాలం కలిసి వచ్చేది ఎప్పుడో..?

తెలుగు ఇండస్ట్రీలో ఎప్పటికప్పుడు చాలామంది కొత్త నటీనటులు ఎంట్రీ ఇస్తూనే ఉంటారు. వారిలో బ్యాక్ గ్రౌండ్ ఉన్న కొంతమంది స్టార్ హీరో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి మొదటిలో మంచి మంచి సినిమాల్లో నటించినా తరువాత ప్రేక్షకులను మెప్పించలేకపోతున్నారు. ప్రస్తుత కాలంలో ఎంత సినీ బ్యాగ్రౌండ్ తో వచ్చిన టాప్ హీరో అయినా సరే కధ‌లో కంటెంట్ లేకపోతే సినిమాలు ఫ్లాప్ అవుతాయని ప్రేక్షకులు నిరూపిస్తున్నారు. అందులో భాగంగానే ఇప్పుడు చిన్న హీరోలు సైతం ఎటువంటి బ్యాగ్రౌండ్ లేకుండా వచ్చి సత్తా చాటుతుంటే.. బడా ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ తో వచ్చిన స్టార్ హీరోలు తమ సినిమాలతో ఫ్లాప్ లను దక్కించుకుంటున్నారు.

ముఖ్యంగా ఇలాంటి వారిలో ఇటీవల మెగా ఫ్యామిలీ నుంచి ప్రిన్స్ వరుణ్ తేజ్, అక్కినేని ఫ్యామిలీ నుంచి నాగచైతన్య కాస్త తమ సిని కెరీర్‌లో చతికల పడ్డారని చెప్పవచ్చు. వీరిద్దరూ సరైన హీరో ఫిజిక్‌తో యాక్టింగ్ లో 100% ఇచ్చినా కథ కంటెంట్ కారణంగాను మరింకేదో కారణంగా వీరికి సరైన సక్సెస్ రావటం లేదు. అలా 2021 నుంచి విరి సినీ కెరీర్‌లో ఒక్కసారైనా హిట్ కూడా కనిపించలేదు. ఇకపోతే వరుణ్ తేజ్ నటించిన ఫిదా భారీ విజయని సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఆ తర్వాత వచ్చిన తొలిప్రేమ పర్వాలేదు. ఆ తర్వాత తను నటించిన గద్దల కొండ సినిమాని కూడా ప్రేక్షకులు ఆదరించారు.

కానీ వరుణ్ తేజ్ గని సినిమా తరువాత నటించిన ఏ సినిమా సక్సెస్ కాలేదు. ఇక చైతన్య‌ విషయానికి వస్తే రారండోయ్ వేడుక చూద్దాం సినిమా ఫ్యామిలీ ఎంటర్టైలర్ గా ప్రేక్షకులు బానే అలరించింది. ఆ తర్వాత వచ్చిన మజిలీ, వెంకీ మామ, లవ్ స్టోరీ, బంగార్రాజు ఇలా వరుస సినిమాలతో హిట్ల సాధించిన.. చైతు గత రెండు సంవత్సరాలుగా ఓపెనింగ్స్ లోనే మంచి ఫలితాలు అందుకోలేకపోతున్నాడు. ఇక ఈ ఇద్ద‌రు హీరోలు ఇప్పటికైనా కథల విషయంలో ఆచితూచి అడుగులు వేసి ఎలాగైనా సక్సెస్ సాధించాలని తమ అభిమానులు కోరుకుంటున్నారు.