ట్విటర్లో ఆ 6గును మాత్రమే ఫాలో అవుతున్న చరణ్.. ఇంత‌కి వారు ఎవరంటే..!?

టాలీవుడ్ లో పాన్ ఇండియా హీరోలలో రామ్ చరణ్ కూడా ఒకరు.. త్రిబుల్ ఆర్ సినిమాతో ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది అభిమానులను క్రియేట్ చేసుకున్నారు. ఈ సినిమాలో రామ్ చరణ్ నటన చూసి ఒకప్పుడు విమర్శించిన వారే ప్రశంసలు కూడా కురిపించారు. మెగాస్టార్ చిరంజీవి కి తగ్గ తనయుడు అంటూ పొగడ్తల వర్షం కురిపించారు. దాంతో ఆయన నటించే కొత్త సినిమాలు పై మరిన్ని అంచనాలు పెరిగాయి. ప్రస్తుతం చరణ్ స్టార్‌ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో గేమ్ ఛేంజర్ అనే సినిమా చేస్తున్నాడు.

ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ హీరోయిన్గా నటిస్తుంది.. మరో హీరోయిన్ అంజలి ముఖ్యమైన పాత్రలో నటిస్తుంది. సినిమాలతో ఎంతో బిజీగా ఉండే చరర్ సోష‌ల్‌ మీడియాలోను ఎంతో యాక్టివ్గా ఉంటారని విషయం అందరికి తెలిసిందే. ఇన్ స్టా, ట్విట్టర్ వేదికగా ఎప్పటికప్పుడు తన అభిమానులతో టచ్ లో ఉండరు. రామ్ చరణ్ ట్విట్టర్ ఖాతాలో ఎవరెవరిని ఫాలో అవుతున్నారని విషయం ఎప్పుడైనా గమనించారా..? ప్రస్తుతం చరణ్ ఖాతాలో మొత్తం మూడు మిలియన్ కు పైగా ఫాలోవర్లో ఫాలో అవుతున్నారు. కానీ రామ్ చరణ్ మాత్రం కేవలం ఆరుగురిని మాత్రమే ఫాలో అవుతున్నారు. ఇంతకీ వారెవరో ఇక్కడ చూద్దాం.

ట్విట్టర్ వేదికగా రామ్ చరణ్ ఫాలో అవుతున్న వారిలో ముందుగా ఆయన బాబాయ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, అలాగే ఆయన భార్య ఉపాసన కొణిదల, దర్శక దీరుడు రాజమౌళి, సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్, ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా, తండ్రి మెగాస్టార్ చిరంజీవిని ఫాలో అవుతూ వస్తున్నాడు చరణ్. ఇక గతంలో చరణ్ ని గ్లోబల్ స్టార్ అంటూ ఆనంద్ మహీంద్రా ట్వీట్ చేసిన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే.. ప్రస్తుతం గేమ్ ఛేంజర్ సినిమాలో నటిస్తున్న రామ్ చరణ్.. ఆ తర్వాత డైరెక్టర్ బుచ్చిబాబు సన దర్శకత్వంలో ఓ ప్రాజెక్ట్ చేయనున్నారు. వీరిద్దరి కాంబోలో రాబోతున్న కొత్త ప్రాజెక్ట్ ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఇందులో నటించే నటీనటుల గురించి త్వరలోనే పూర్తి వివరాలు తెలియనున్నాయి.