`స్కంద‌`ను భ‌య‌పెడుతున్న బ్యాడ్ సెంటిమెంట్‌.. రిపీటైతే రామ్ కి డిజాస్ట‌రే!

మాస్ డైరెక్ట‌ర్ బోయ‌పాటి శ్రీ‌ను, ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని కాంబోలో రాబోతున్న మొద‌టి సినిమా `స్కంద‌`. శ్రీనివాస సిల్వర్‌ స్క్రీన్‌ బ్యానర్‌పై శ్రీనివాస చిట్టూరి నిర్మించిన ఈ చిత్రంలో శ్రీ‌లీల‌, సాయి మంజ్రేకర్ హీరోయిన్లుగా న‌టించారు. సెప్టెంబ‌ర్ 15న ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో అట్ట‌హాసంగా విడుద‌ల కాబోతోంది. ప్ర‌మోష‌న్స్ కూడా ఊపందుకున్నాయి. కానీ, స్కంద‌ను ఇప్పుడు ఓ బ్యాక్ సెంటిమెంట్ భ‌య‌పెడుతోంది.

మాస్ చిత్రాల‌కు బోయ‌పాటి శ్రీ‌ను కేరాఫ్ అడ్రెస్ అన్న సంగ‌తి అంద‌రికీ తెలుసు. కెరీర్ ఆరంభం నుంచి ఆయ‌న ఒకే ఫార్మాలాను ఫాలో అవుతున్నారు. ఆయ‌న సినిమాల్లో క‌థ‌, క‌థ‌నం రొటీన్ గా ఉన్నా ప‌వ‌ర్ ఫుల్ యాక్షన్ ఎపిసోడ్స్ మాత్రం హైలెట్ అవుతుంటాయి. కొత్త‌ద‌నం కోరుకునే వారికి న‌చ్చ‌క‌పోయినా.. మాస్ ప్రేక్ష‌కులు మాత్రం బోయ‌పాటి సినిమాల‌కు క‌నెక్ట్ అవుతుంది. అందులోనూ ముఖ్యంగా బోయపాటి కథలు, హీరోయిజం బాలయ్యకి భాగా క‌లిసొచ్చాయి. వీరిద్దరి క‌ల‌యిక‌లో వ‌చ్చిన సింహా, లెజెండ్, అఖండ.. మూడు చిత్రాలు ఘ‌న విజ‌యం సాధించాయి.

ఈ మూడు చిత్రాల్లో వైలెన్స్ బీభ‌త్సంగా ఉంటుంది. అయినాకూడా ప్రేక్ష‌కులు చూశారు. కానీ, బోయ‌పాటి ఇలాంటి క‌థ‌ల‌తో ఇత‌ర హీరోల‌తో చేస్తే మాత్రం బాక్సాఫీస్ వ‌ద్ద ఆయా సినిమాలు బోల్తా ప‌డ్డాయి. ఎన్టీఆర్ `ద‌మ్ము`, రామ్ చ‌ర‌ణ్ `వినయ విధేయ రామ`, బెల్లంకొండ శ్రీ‌నివాస్ `జయ జానకి నాయక` వంటి సినిమాలు ఇందుకు నిద‌ర్శ‌నం. ఇక స్కందలోనూ న‌రుక్కోవ‌డం, ర‌క్త‌పాత‌లు దండిగా ఉన్నాయ‌ని ట్రైల‌ర్ తోనే స్ప‌ష్ట‌మైంది. దీంతో బోయ‌పాటి పేరిట ఉన్న బ్యాడ్ సెంటిమెంట్ కు స్కంద ఎక్క‌డ బ‌లైపోతుందో అని రామ్ ఫ్యాన్స్ వ‌ర్రీ అవుతున్నారు. ఒక‌వేళ అదే గ‌నుక జ‌రిగే రామ్ ఖాతాలో డిజాస్ట‌రే అని చ‌ర్చించుకుంటున్నారు.