నా సామిరంగ:సరికొత్త గెటప్ లో దుమ్ము దులిపేస్తున్న నాగార్జున..!!

టాలీవుడ్ మన్మధుడు అంటే కచ్చితంగా నాగార్జున పేరే అందరికీ గుర్తుకువస్తుంది.. అయితే ఈరోజు నాగార్జున 64వ పుట్టినరోజు సందర్భంగా నాగార్జున అభిమానులు సైతం ఆయన సినిమాలు అప్డేట్ల కోసం చాలా ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.. అనుకున్నట్టుగానే ఈ రోజున పలు సినిమాల అప్డేట్లు విడుదల చేయడం జరుగుతోంది. 64 ఏళ్ల వయసులో అందం ఆరోగ్యంగా ఉండడమే కాకుండా ఫిట్ బాడీని మెయింటైన్ చేస్తూ కుర్ర హీరోలకు పోటీ ఇస్తున్నారు నాగార్జున.. ఇప్పటికే 98 సినిమాలు చేసిన నాగార్జున వందోవ సినిమాకి మరో రెండు అడుగుల దూరంలో ఉన్నారు.

నాగార్జున గత సంవత్సరం ఘోస్ట్ సినిమాతో వచ్చి నిరాశపరిచారు ..అయితే ఈసారి కచ్చితంగా సక్సెస్ అవ్వాలని తన తదుపరి చిత్రాన్ని పుట్టినరోజు సందర్భంగా అనౌన్స్మెంట్ చేశారు. నాగార్జున పుట్టినరోజు సందర్భంగా 99వ సినిమా అని ప్రకటిస్తూ శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ పతాకం పైన ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నాగార్జున ఎప్పుడు కూడా కొత్త డైరెక్టర్లను ప్రోత్సహిస్తూ ఉంటారు.. ఇప్పుడు తాజాగా ఈ సినిమాకి కూడా విజయ్ బిన్నీని పరిచయం చేయబోతున్నారు.

నాగార్జున 99వ సినిమాకి “నా సామిరంగ” అనే ఒక సరికొత్త టైటిల్ ని ప్రకటించారు చిత్ర బృందం. టైటిల్ తో పాటు చిన్న గ్లింప్స్ కూడా విడుదల చేయడం జరిగింది దీంతో అభిమానులు ఫుల్ ఖుషి అవుతున్నారు ఈసారి కూడా ఖచ్చితంగా నాగార్జున సక్సెస్ అవుతారని అభిమానులు నమ్ముతున్నారు.. నాగార్జున అని లుంగీ కట్టించి బీడీ కాలుస్తూ మరొకసారి మాస్ రోల్ లో కనిపించబోతున్నారు. అయితే ఇంతవరకు ఇలా నాగార్జునను చూడలేదంటూ పలువురు నేటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.. సంక్రాంతి బరిలో ఈ సినిమా దిగబోతున్నట్లు తెలుస్తోంది.